Israel: దాడులు చేస్తాం..ఇళ్ళను వదిలేసి వెళ్ళండి–ఇజ్రాయెల్

 హిజ్బుల్లాను పూర్తిగా నాశనం చేసేవరకూ ఇజ్రాయెల్.. లెబనాన్‌ను విడిచిపెట్టేలా లేదు. అక్కడ వరుసగా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా దక్షిణ లెబనాన్ ను ఖాళీ చేసి వెళ్ళాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. 

author-image
By Manogna alamuru
New Update
attacks

Israel Attcks: 

ఇజ్రాయెల్‌‌–హమాస్ మధ్య యుద్ధం ఏడాదిగా ఆగడం లేదు. ఇప్పుడు ఇందులోకి హెజ్బుల్లా వచ్చి చేరడంతో ఇది మరింత తీవ్రమైంది. ప్రస్తుతం హెజ్బుల్లాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ లెబనాన్ మీద వరుస దాడులతో విరుచుకుపడుతోంది. దక్షిణ లెబనాన్‌లో పౌరుల నివాస స్థలాల్లో హెజ్బుల్లా ఆయుధాలను భారీగా దాచిపెట్టింది అని ఇజ్రాయెల్ ఎప్పటినుంచో చెబుతోంది ఇప్పుడు వాటిని నాశనం చేసేందుకు అక్కడ టార్గెట్ చేసింది. దీంతో దక్షిణ లెబనాన్‌లో నివసించే ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సేనలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని స్థానికులకు సూచించాయి. 

ఇజ్రాయెల్..హెజ్బుల్లా మీద ప్రత్యక్ష దాడులకు దిగిపోయింది. వారిని సమూలంగా నాశనం చేయడమే లక్ష్యమని చెబుతోంది. ఎన్నో ఏళ్ళుగా హెజ్బుల్లా ఆయుధాలను దాస్తోందని.. లెబనాన్ పౌరుల గృహాల కింద వాటని దాస్తోందని అంటోంది ఇజ్రాయెల్. అలాగే పౌరులను కవచాలుగా ఉపయోగించడంతో పాటూ దక్షిణ లెబనాన్‌ను యుద్ధ భూమిగా మార్చిందని ఐడీఎఫ్‌ ఆరోపించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని నివాసితులు వారి ఇళ్లకు తిరిగి వచ్చేలా భద్రతను స్థాపించేందుకు, యుద్ధ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తోందని ప్రకటించింది. 

అంతకు ముందు లెబనాన్‌, సిరియాలపై ఇజ్రాయెల్ అనూహ్య దాడి చేసింది. రెండు దేశాల్లో ఒకేసారి వందల పేజర్లు పేల్చింది. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. 2750 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్క సిరియాలోనే ఏడుగురు మరణించారు. గాయపడిన వారిలో లెబనాన్‌ లోని ఇరాన్‌ రాయబారితో పాటు హెజ్‌బొల్లా కీలక నేతలు కూడా ఉన్నారు. పేజర్లు పేలిన ఘటనలో ఇద్దరు హెజ్‌బొల్లా సభ్యులు మరణించారు. ఒక ఎంపీ కుమారుడు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాని తరువాత వాకీటాకీలు, మరికొన్ని ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కూడా దాడులు చేసింది. ఇందులో తొమ్మిది మంది చనిపోగా...300 మంది దాకా గాయపడ్డారు. 

Also Read: Business: రికార్డుల మోత మోగిస్తున్న స్టాక్ మార్కెట్

Advertisment
Advertisment
తాజా కథనాలు