Israel-Iran: ఇరాన్ సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది. నెలల తరబడి దాడులకు దిగుతున్న ఇరాన్ కు బుద్ది చెప్పేందుకు ఇజ్రాయెల్ దాడులకు దిగిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ శనివారం తెల్లవారుజామున ప్రకటించింది.
Also Read: ప్రైవేట్ స్కూళ్లో గ్యాస్ లీకేజీ...30 మంది విద్యార్థులు..!
ఇరాన్‌లో శనివారం తెల్లవారు జామున భారీ పేలుళ్లు వినిపించాయని, అక్టోబర్ 1న ఇరాన్ జరిపిన బాలిస్టిక్-క్షిపణి దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందని స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
Also Read: భారత్ దెబ్బ..మాల్దీవులు అబ్బా..డబ్బుల్లేక అధ్యక్షుడీ జీతంలో కోత
"ఇజ్రాయెల్ రాజ్యానికి వ్యతిరేకంగా ఇరాన్‌లోని పాలన నుండి నెలల నిరంతర దాడులకు ప్రతిస్పందనగా- ప్రస్తుతం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై కచ్చితమైన దాడులు నిర్వహిస్తోందంటూ.. IDF శనివారం X లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
Also Read: నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్.. విదేశాల్లో భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం
ఇరాన్‌లోని పాలన , ఈ ప్రాంతంలోని దాని ప్రాక్సీలు ఇరాన్ నుంచి ప్రత్యక్ష దాడులతో సహా ఏడు రంగాల్లో "అక్టోబర్ 7 నుండి ఇజ్రాయెల్‌పై కనికరం లేకుండా దాడి చేస్తున్నాయి" అని IDF పేర్కొంది.