Lebanan: ఓ వైపు ప్రసంగం..మరో వైపు దాడులు! హిజ్బుల్లాకు వ్యతిరేకంగా దాడులను కొనసాగిస్తామని, హమాస్‌పై విజయం సాధించేవరకు పోరాడతానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. మా లక్ష్యాలను చేరేవరకు హెజ్బుల్లాపై పోరాటం కొనసాగిస్తామని నెతన్యాహు శపథం చేశారు. By Bhavana 28 Sep 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Israel: హిజ్బుల్లా అంతమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రతిజ్ఞ చేసిన కొన్ని నిమిషాలకే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌పై విరుచుకుపడింది. హిజ్బుల్లా సంస్థకు చెందిన స్థావరాలు టార్గెట్‌గా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరూట్‌కు దక్షిణాన వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. బీరూట్‌కు దక్షిణాన జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో భారీగా పొగ మేఘాలు కమ్ముకున్నాయి.ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ.. దక్షిణ శివార్లలోని హిజ్బుల్లా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. న్యూయార్క్‌లోని యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రతినిధులను ఉద్దేశించి నెతన్యాహు ప్రసంగాన్ని ముగించిన కొద్ది క్షణాల తర్వాత ఈ బాంబు దాడులు జరిగాయి. ఆ సమయంలో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా దాడులను కొనసాగిస్తామని, హమాస్‌పై విజయం సాధించేవరకు పోరాడతానని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు.అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దండెత్తింది. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకుపోయారు. ఆ ఘటనతో ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోయింది. ఆ నాటి నుంచి ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. హమాస్ లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. హమాస్‌కు వత్తాసు పలికిన లెబనాన్‌పై కూడా దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా ఐరాస వేదికగా నెతన్యాహు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 90 శాతం మంది హమాస్ రాకెట్లను నాశనం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే వారి సగం బలగాలను అంతం చేయడమో, బంధించడమో చేశామని.. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు కృషి చేస్తామని... మా లక్ష్యాలను చేరేవరకు హెజ్బుల్లాపై పోరాటం కొనసాగిస్తామని నెతన్యాహు శపథం చేశారు. ఏడాది కాలంగా ఈ పరిస్థితులను సహిస్తూనే వస్తున్నామని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.ఈసారి ఐరాస సమావేశాలకు రావాలని లేకపోయినప్పటికీ. తమపై కొన్ని దేశాధినేతలు చేసిన అవాస్తవాలను ఖండించడానికే ఇక్కడికి వచ్చినట్లు ఆయన వివరించారు. ఇజ్రాయెల్ శాంతిని కోరుకుంటుదన్నారు. ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. చాలా కాలంగా యావత్ ప్రపంచం ఇరాన్‌ను బుజ్జగిస్తూ వస్తోందని.. దానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. Also Read: కూలిన ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయ గోడ.. ఇద్దరు మృతి #lebanon #israel-hezbollah సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి