ఏదో ఇజ్రాయెల్ పైపై ఒప్పందాలు చేసకుంటోంది తప్పితే నిజంగా కాల్పుల విరమణ చేసుట్టు కనిపించడం లేదు. రెండు రోజుల నుంచి కాల్పుల విరమణ మాకు ఓకే అంటోంది...ఆ ఒప్పందానికి రెడీ కూడా అయింది. కానీ దాడులను మాత్రం ఆపడం లేదు. బీరుట్ మీద విరుచుకుపడుతూనే ఉంది. హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులను చేస్తోంది. దీంతోపాటు దాడులు మొదలుకాకముందే ఖాళీ చేసి వెళ్లిపోవాలని అనేక భవనాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వైమానిక దాడుల్లో ఎంతమంది మరణించారనే విషయం తెలియడం లేదు.
కేబినెట్ సమావేశం..
హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణకు ఓకే చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు...దీనికి సంబంధించి భద్రతా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే సంధికి ఆమోదం చెబుతారని తెలుస్తోంది. ఈ ఒప్పందానికి హెజ్‌బొల్లా కూడా అంగీకరించినట్లు లెబనాన్ అధికారులు తెలిపారు. ఒకవేళ ఇది ఇరువైపులా ఆమోదం పొందితే మాత్రం.. ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కొనసాగుతోన్న యుద్ధం ముగింపునకు కీలక అడుగు పడినట్లే.
Also Read: Delhi: ఉగ్రవాదానికి భారత్ బదులిస్తుంది–మోదీ