/rtv/media/media_files/2026/03/03/iran-attacks-gulf-countries-2026-03-03-20-33-33.jpg)
Iran attacks Gulf countries
Iran attacks Gulf countries : ఖమేని హత్యతో ఇరాన్ రెచ్చిపోతోంది. ఒంటరి పోరాటంతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాపై కక్షతో గల్ఫ్ దేశాల భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురుధరలు ఆకాశాన్నంటడమే కాదు నిత్యావసర ధరలకు రెక్కలు వచ్చేలా చేస్తోంది.
అసలు గల్ఫ్ దేశాలపై ఇరాన్‌కు ఎందుకంత కక్ష..? అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికాను వదిలేసి గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల మోత దేనికి..? ఔను అందరికీ ఈ డౌట్ రావడం కామన్. కానీ ఇరాన్ పోరాటానికి కారణం ఉంది. ఇజ్రాయెల్‌కు సపోర్ట్‌గా అమెరికా ఎప్పుడైతే రంగంలోకి దిగిందో నాటి నుంచి గల్ఫ్‌దేశాలపై ఇరాన్ ఓ కన్నేసి ఉంచింది. ఎందుకంటే అమెరికా సైనిక స్థావరాలకు గల్ఫ్‌దేశాలు ఆశ్రయం ఇవ్వడం ఇరాన్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇరాన్‌పై ముప్పేటదాడి చేయడానికి గల్ఫ్‌దేశాల్లో అమెరికా స్థావరాల ఏర్పటే దీనికి కారణం. మరోవైపు ఇక్కడ మతాల సమస్యగా కూడా చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక షియాలుండే ఇరాన్...సున్నీప్రజలుండే గల్ఫ్‌దేశాలే టార్గెట్‌గా యుద్ధం చేస్తుందన్నది అనలిస్టుల మరోమాట. సో, గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలపై గట్టిగా కొట్టాలన్నది ఇరాన్ వ్యూహంగా చెబుతున్నారు.
అందుకే ప్రపంచానికి చమురు సప్లై చేసే గల్ఫ్ దేశాల ఆయిల్ రిఫైనరీలపై టార్గెట్ చేస్తూ...ఆదేశాల పర్యాటకంపైనా దెబ్బకొట్టింది. అందుకే గల్ఫ్ దేశాల్లో ప్రధాన విమానాశ్రయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరాన్ మిస్సైల్స్ దాడులకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ధ్వంసం అయింది. టెర్మినల్ పూర్తిగా దెబ్బతినడంతో ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే మిస్సైల్స్ దాడులకు జాయెద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కూడా మూతపడింది. ఇక యెమన్‌లో సనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తిగా ధ్వంసమయింది. యెమన్ ఎయిర్‌వేస్ విమానాలు దాడుల్లో నష్టపోయాయి. కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్‌బేస్ ఇరాన్ దెబ్బకు కోలుకోకుండా పోయింది. అలాగే దోహ గగనతలం మూసివేయడంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. బహ్రెయిన్‌లో మనామా ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుళ్లు జరగడంతో అక్కడి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
గల్ఫ్ దేశాలు ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిఉన్నాయి. ప్రపంచానికి భారీమొత్తంలో ఆయిల్ ఎగుమతి చేస్తోంది గల్ఫ్‌దేశాలే. ఆయా దేశాలవారీగా ఆయిల్ రిఫైనరీలను పరిశీలిస్తే..సౌదీ అరేబియాలో సౌదీ ఆరామ్‌కో, రాస్ తనూరా, జుబైల్, యన్భు, రియాద్ రిఫైనరీలు ఉన్నాయి. ఇందులో సౌదీ ఆరామ్‌కో రిఫైనరీ దేశంలోనే అతిపెద్దది, రోజుకు 5లక్షల 50వేల బ్యారెళ్లు ఉత్పత్తి చేస్తుంది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రువైస్ రిఫైనరీ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సింగిల్ సైట్ రిఫైనరీగా పేరుంది. పైగా రోజుకు ఈ రిఫైనరీ నుంచి 8లక్షల 50వేల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. అలాగే యూఏఈలో జెబెల్ అలీ, ఫుజైరా రిఫైనరీ సైతం ప్రపంచ చమురు ఉత్పత్తిలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. కువైట్ విషయానికి వస్తే 2022లో ఏర్పాటైన అల్‌జౌర్ రిఫైనరీ రోజుకు 6లక్షల 15వేల బ్యారెళ్ల సామర్థ్యంతో కువైట్‌లోనే అతిపెద్దదిగా నిలిచింది.
అలాగే కువైట్‌లో మరో అతిపెద్ద రిఫైనరీగా మినా అల్ అహ్మది సొంతం చేసుకోగా, మినా అబ్దుల్లా రిఫైనరీ సైతం ఉన్నాయి. ఖతార్‌లో లాఫాన్ రిఫైనరీ, మెసైద్ రిఫైనరీలు ఉన్నాయి. ఒమన్‌లోని మస్కట్ మినా అల్ ఫహల్ రిఫైనరీ, దుక్మ్ రిఫైనరీ ఉన్నాయి. సిట్రా రిఫైనరీ అనేది బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థలో కీరోల్ పోషిస్తుంది.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దెబ్బ మామూలుగా లేదు. ఇరాన్‌కు అతిదగ్గరగా ఉండటంతో గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి. సముద్రమార్గం ద్వారా దుబాయ్ 120 కిలోమీటర్ల దగ్గర్లోనే ఉంది. కువైట్‌కు కేవలం గంటన్నర సమయం మాత్రమే. ఇక ఇరాన్ నుంచి 423 కిలోమీటర్ల దూరంలోనే ఉంది బహ్రెయిన్. అలాగే ఖతార్ విమాన ప్రయాణం కేవలం రెండు గంటలు. టెహ్రాన్ నుంచి దోహా మధ్య విమాన దూరం సుమారు 1100 కిలోమీటర్లు. ఒమన్ విషయానికి వస్తే హెర్మూజ్ జలసంధికి అతిదగ్గరగా ఉంటుంది. కేవలం 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒమన్...ఇరాన్‌కు ఫస్ట్ టార్గెట్ అని చెప్పొచ్చు
గల్ఫ్ దేశాలపై అటాక్ మాత్రమే కాదు...హెర్మూజ్ జలసంధిని సైతం క్లోజ్ చేసి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది ఇరాన్. వాస్తవానికి ప్రపంచానికి అవసరమైన ఆయిల్‌ను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 28.2శాతం సప్లై చేస్తోంది. అదికూడా హెర్మూజ్ జలసంధి ద్వారానే. ప్రపంచ ఆయిల్ సరఫరాలో దాదాపు 25శాతం హెర్మూజ్ జలసంధిద్వారానే రవాణా అవుతుందనేది లెక్కలు చెబుతున్నాయి. అలాంటి సముద్రమార్గాన్ని సైతం తన ఆధీనంలోకి తీసుకుని ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది ఇరాన్.
ఇరాన్ యుద్ధంతో ఆయిల్ సప్లై తగ్గితే చమురుధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మనదేశానికి తీవ్రమైన నష్టం. దాదాపు 85శాతం ముడిచమురు దిగుమతిపైనే ఆధారపడిఉన్నాం. ఈ పరిస్థితుల్లో ధరలు పెరిగితే రూపాయి విలువపడిపోతుంది. రవాణా, నిత్యవసరధరలు సైతం పెరిగిపోతాయి. సామాన్య, మధ్యతరగతి జీవితాలు కష్టాల్లో పడతాయి.
అలాగే చమురు ధరల పెరుగుదలతో శత్రుదేశం చైనాకు భారీనష్టమే. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతయ్యే దేశం చైనానే. అలాంటి చైనాలో పారిశ్రామిక రంగానికి పెద్దదెబ్బే అంటున్నారు అనలిస్టులు. ఇక ఇదే బాటలో థాయిలాండ్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్‌వంటి దేశాలు కూడా ఇంధన దిగుమతి ఆధారితం వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ఇక సహజవాయువుపైనే ఆధారపడే యూరప్ దేశాలు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. బ్రిటన్, ఇటలీ, పోలాండ్ వంటివి సహజవాయువుపైనే ఆధారపడుతుంటాయి. వాళ్లకు గ్యాస్ లేనిదే రోజు గడవదు. ఇప్పటికే ఖతార్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో యూరప్‌లో గ్యాస్ ధరలు 50శాతం పెరిగాయి. యూరప్‌లో పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడే అవకాశం ఉంది. అలాగే యూరో విలువ భారీగా పతనం కావొచ్చు. ఇప్పటికే ఐరోపా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం యూరప్‌కు మరో ప్రమాదం పొంచిఉంది. అదే శరనార్థుల సమస్య. లక్షలాదిమంది టర్కీ మీదుగా యూరప్‌కు వలసవచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదేజరిగితే యూరప్ దేశాల్లో సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలకు దారితీయొచ్చు. మరోవైపు బ్రిటన్ వైమానిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో అక్కడి ఇంటెలిజెన్స్ అప్రమత్తమయింది. యూరప్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని ఆయా దేశాలకు హెచ్చరికలు జారీచేసింది.
Follow Us