క్షిపణి వ్యవస్థ పూర్తిగా ధ్వంసం.. ఇరాన్‌పై గట్టి దెబ్బ వేసిన ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణి వ్యవస్థను ఇజ్రాయెల్ పూర్తిగా ధ్వంసం చేసింది. ఘన ఇంధనం తయారు చేసే కేంద్రాలు, డ్రోన్ల తయారీ యూనిట్, హెవీ ఫ్యూయల్ మిక్సర్లు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. వీటి ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుందట. By Kusuma 28 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇరాన్ క్షిపణి వ్యవస్థపై ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఆ దేశ క్షిపణి వ్యవస్థపై ఇజ్రాయెల్ విమానాలు కోలుకోలేని దెబ్బ వేశాయి. ఘన ఇందన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకి పైగా కేంద్రాలను ధ్వంసం చేశాయి. మళ్లీ ఇదే ఉత్పత్తిని ప్రారంభించాంటే కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: జగన్, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్! కర్మాగారం పూర్తిగా ధ్వంసం.. టెహ్రాన్‌లోని ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ దారుణంగా దెబ్బతీసింది. అలాగే పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లో డ్రోన్ల తయారీ యూనిట్‌ని కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. ఇందులో మూడు భవనాలు దెబ్బతిన్నట్లు ఇరాన్ గుర్తించింది. ఖెబర్, హజ్ ఖాసీం బాలిస్టిక్ మిసైల్స్‌లో ఘన ఇంధనాన్ని వినియోగిస్తారు. దీన్ని తయారు చేసే కర్మాగారాన్ని కూడా ధ్వంసం చేశారు. అయితే గతంలో ఇరాన్.. ఇదే క్షిపణులను ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు వినియోగించింది. ఇది కూడా చూడండి: Breaking: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు.. ఈ కర్మాగారం ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్‌కు వెన్నెముక వంటిదని చెప్పవచ్చు. మొత్తం 20 హెవీ ఫ్యూయల్ మిక్సర్లు ఇజ్రాయెల్ దాడులకు ధ్వంసమయ్యాయి. ఈ ఒక్కో మిక్సర్ ధర దాదాపుగా రూ.2 మిలియన్ డాలర్లు ఉంటాయట. మళ్లీ ఈ మిక్సర్లను తిరిగి అమర్చాలంటే కనీసం ఏడాది పాటు అయిన సమయం పడుతుంది. ఇది కూడా చూడండి: అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా.. దీంతో ఇరాన్ ఘన ఇంధనం మిక్సర్ తయారీ, ఎగుమతి చేయడం కష్టమే. దీంతో మిక్సర్లకు భారీగా డబ్బు కట్టి ఇరాన్ దిగుమతి చేసుకుంది. దీనివల్ల ఇరాన్‌కి భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ క్షిపణులు తయారు చేసే సామర్థ్యంపై ఇజ్రాయెల్ గట్టిగానే దెబ్బ వేసిందని చెప్పుకోవచ్చు. ఇదిలాఉండగా మరోవైపు ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో సుమారు 45 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య #iran-isreal-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి