ఆకాశమే హద్దుగా ఇరాన్ క్షిపణి ప్రతాపం.. 30 ఏళ్ల కష్టం.. 2,500 కిలోమీటర్ల వేగం

మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, ఇరాన్ తన అమ్ములపొదిలోని క్షిపణి శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన వైమానిక దాడులు ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని చాటిచెబుతున్నాయి.

New Update
_missile system

మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, ఇరాన్ తన అమ్ములపొదిలోని క్షిపణి శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన వైమానిక దాడులు ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని చాటిచెబుతున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసుకుంది. కేవలం ఇజ్రాయెల్‌నే కాకుండా, గల్ఫ్ దేశాలైన ఖతార్, యూఏఈ, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యం ఇరాన్ సొంతం. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులను వాటి ప్రయాణ దూరాన్ని బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు.

1. స్వల్ప శ్రేణి క్షిపణులు
సమీపంలోని శత్రువులను దెబ్బకొట్టడానికి ఇవి కీలకం.
ఫతే-110: 300 కి.మీ పరిధి.
రాద్-500, ఫతే-313: సుమారు 500 కి.మీ వరకు దూసుకెళ్లగలవు.
జుల్ఫికర్ & కియామ్-1: ఇవి 700 నుండి 800 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తాయి.

2. మధ్యస్థ శ్రేణి క్షిపణులు 
ప్రాంతీయ ఆధిపత్యం కోసం ఇరాన్ వీటిని వాడుతోంది.
షహాబ్-1 & 2: 300 నుండి 700 కి.మీ పరిధి.
షహాబ్-3: ఇది అత్యంత ప్రమాదకరమైనది, 1,300 నుండి 1,450 కి.మీ దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.
ఖాదర్, ఘాదర్: 1,600 నుండి 2,000 కి.మీ పరిధి కలిగి ఉండి, సుదూర ప్రాంతాలను చేరుకోగలవు.

3. దీర్ఘ శ్రేణి క్షిపణులు 
ఖండాంతర స్థాయికి చేరువలో ఉండే ఈ క్షిపణులు ఇరాన్ రక్షణ కవచాలు.
ఖోర్రామ్‌షహర్ & సజ్జిల్: ఇవి 2,000 నుండి 2,500 కిలోమీటర్ల మేర ప్రయాణించగలవు.
సౌమర్: ఇది 2,500 కి.మీ పరిధి కలిగిన శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణి.
ఖైబర్‌షేకర్: 1,450 కి.మీ దూరంలోని లక్ష్యాలను గురితప్పకుండా కొట్టగలదు.

అల్ జజీరా నివేదికల ప్రకారం, 10 నుండి 20 మీటర్ల పొడవుండే ఈ బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు మరియు అత్యాధునిక డ్రోన్లు ఇరాన్ సైనిక వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్షిపణి బలమే అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలను ఆచితూచి అడుగులు వేసేలా చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు