Iran: ఇజ్రాయెల్ మీద క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్

పశ్చిమాసియాలో రోజురోజుకూ యుద్ధం ముదురుతోంది. అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులను చేపట్టింది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికి వరకు 100 క్షిపణులు ప్రయోగించినట్టు తెలుస్తోంది.

attacks
New Update

Iran Attacks: 

హమాస్, హెజ్బులాల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే...ఆ దేశం మీద ఇరాన్ దాడులను మొదలుపెట్టింది.  క్షిపణి దాడులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రత్యక్ష దాడికి దిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది. దీంతో ఇరాన్ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినట్టయింది.  ఈరోజు ఇరాన్ దాదాపు 100 క్షిపణులు ప్రయోగించినట్టు తెలుస్తోంది. టెల్ అవీవ్, జెరూసలేం దగ్గరలో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. అయితే ఇరాన్‌కు ధీటుగా ఇజ్రాయెల్ సైన్యం స్పందిస్తోంది.  వెంటనే అప్రమత్తమైన ఐరన్‌ డోమ్‌ వంటి సాంకేతిక వ్యవస్థలు.. క్షిపణులను దీటుగా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

 

 

ఈ టైమ్‌లో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని అమెరికా చెబుతోంది.  ఇజ్రాయెల్‌కు అండగా నిలిచేందుకు, పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ జాతీయ భద్రత బృందంతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పాల్గొన్నారు.

Also Read: Telangana: ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe