I PHONE: చైనాకు షాక్..భారత్‌ కు ఓకే..ఐఫోన్ 17 తయారీ ప్లేస్ మార్పు?

చైనాకు యాపిల్ కంపెనీ పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 17 తయారీ ఈసారి చైనాలో కాకుండా భారత్‌లో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా టైమ్‌లో చైనాలో యాపిల్ సంస్థకు కలిగిన ఇబ్బందులను దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

12
New Update

I Phone 17 Manufacturing: 

యాపిల్ కంపెనీ చైనాకు దెబ్బ కొట్టి ఇండియాకు మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది.  ఐఫోన్‌ల తయారీలో ఇప్పటికే భారత్ పాత్ర ఉంది. గత కొన్నేళ్ళుగా పలు ఐఫోన్ మోడళ్ళను ఇక్కడే తయారు చేస్తోంది యాపిల్. ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో విదేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా.  అయితే ఇప్పుడు యాపిల్‌ సంస్థ ఐఫోన్ 17 ముందస్తు తయారీని తొలిసారి భారత్‌లో చేపట్టనుందని తెలుస్తోంది. సాధారణంగా ఈ పనిని ఇప్పటి వరకూ చైనాలో చేసేది కంపెనీ. కానీ ఈసారి మాత్రం భారత్ లో చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సాధారణంగా ఐఫోన్‌ మోడల్ విడుదలైన తర్వాత మిగితా ఫోన్లను భారత్‌లో తయారు చేస్తూ ఉంటారు. కానీ.. అమెరికాలోని యాపిల్‌ పార్క్‌లో తర్వాతి తరం మొబైల్‌ డిజైన్‌ రూపొందించాక.. కమర్షియల్‌ లాంచ్‌కు ముందు ఫోన్లను మాత్రం చైనాలోనే ఇన్నిరోజులు యాపిల్‌ కంపెనీ చేపట్టింది. కానీ ఇప్పుడు యాపిల్‌ కంపెనీ తన రూట్ మార్చింది. ఐఫోన్17 మోడల్ విషయంలో ముందస్తు తయారీని భారత్‌లోని ఓ ప్లాంట్‌లో నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల చెబుతున్నాయి. కరోనా టైమ్‌లో యాపిల్ కంపెనీకు చైనాలో చాలా సమస్యలు తలెత్తాయి. అవి ఇప్పటివరకూ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఐఫోన్ 17 మోడల్ తయారీలో ఈ ఇబ్బందులకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది కంపెనీ. అందుకే ఈసారి చైనాలో కాకుండా ఇండియాలో ఫోన్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 

యాపిల్ ప్రస్తుతం ఐఫోన్17 బేస్ మోడల్‌పై పని చేయడం ప్రారంభించింది. ఈ మోడల్ రిలీజ్ జూన్, జూలైల్లోరిలీజ్ చేస్తుంది. ఆ తరువాత ఎప్పటిలానే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఐఫోన్ 17 విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది కంపెనీ. ఇక గత నెలలో యాపిల్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 16లో నాలుగు రకాల మోడల్స్‌ ఉన్నాయి.  ఐఫోన్ 16 (iPhone 16), ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus), ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) , ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (iPhone 16 Pro Max) ఉన్నాయి.

Also Read: TG: తెలంగాణలో మయోనైజ్ నిషేధం

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe