/rtv/media/media_files/2026/02/28/fotojet-14-2026-02-28-17-39-07.jpg)
Indians trapped in Iran
Iran war : ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు భారతీయులు తమను కాపాడాలంటూ భారత ఎంబసీకి సెల్ఫీ వీడియోలు పంపుతున్నారు. ఇరాన్‌లో ప్రస్తుతం 10వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఉన్నత చదువులకోసం పోయిన 2వేలమందికిపైగా భారతీయ విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. వీరంతా టెహ్రాన్, ఇస్ఫహాన్, జాహెదాన్ నగరాల్లో నివాసం ఉంటున్నారు. కాగా టెహ్రాన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ఎమర్జెన్సీ నెంబర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఎమర్జెన్సీ నెంబర్లు +989128109115/109/102, +98993217959లకు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇరాన్‌లో చిక్కుకుపోయిన10వేల మందికిపైగా భారతీయులతో పాటు 2వేల మందికి పైగా విద్యార్థులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేయాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. యుద్ధం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భారత్‌కోరింది. ఏవైన సమస్యలు ఉంటే - టెహ్రాన్‌లోని ఇండియా ఎంబసీని సంప్రదించాలని భారత్ కోరింది. కాగా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్న మూసివేసింది. దీంతో భారతీయులను తరలించడానికి అక్కడికి విమానాన్ని అనుమతించే అవకాశం లేదు. దీంతో భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే అవకాశాలు ప్రస్తుతం లేవనే చెప్పాలి. ఒకవేల రెండు దేశాలు ఆయా దేశాల్లో చిక్కుకుపోయిని విదేశీయులు తమ సొంత దేశానికి వెళ్లడానికి వీలుగా యుద్ధ విరమణ పాటిస్తే వారి తరలింపుకు అవకాశం ఉంటుంది.
యుద్ధంలోకి పాకిస్తాన్
ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చింది. యుద్ధంలో పాక్ ఇరాన్‌కు మద్దతుగా నిలిచింది. ఇరాన్ విదేశాంగ మంత్రితో పాకిస్తాన్ మంత్రి ఒకరు ఫోన్లో మాట్లాడారు. మరోవైపు ఇరాన్‌లో దాడులను పాకిస్తాన్ ఖండించింది.ట్రంప్ వెంటనే యుద్ధం ఆపాలని పాకిస్తాన్ కోరింది.
Follow Us