Canada: ట్రూడో ప్రభుత్వం మీద నమ్మకం లేదు–దౌత్యవేత్తలు వెనక్కు

అనుమానితుల జాబితాలో భారత దౌత్య వేత్త పేరును చేర్చడంతో మండిపడుతున్న భారత ప్రభుత్వం...ఇప్పుడు అక్కడి దౌత్యవేత్తలను వెనక్కు పిలిపిస్తున్నట్టు తెలుస్తోంది. ట్రూడో సర్కార్ మీద నమ్మకం లేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. 

author-image
By Manogna alamuru
New Update
India Canada Row : భారత్ ఒక్క అడుగు వెనక్కు వేస్తే..కెనడా పని ఖతం..!!

India Vs Canada: 

భారత్–కెనడాల మధ్య ఉన్న సంబంధాలు మళ్ళా దెబ్బతిన్నాయి. దీనికి కారణం కెనడా ప్రభుత్వం దుందుడుకు చర్యే. తాజాగా నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చింది కెనడా ప్రభుత్వం. పర్శన్ ఆఫ్ ఇంట్రస్ట్ అనే జాబితాను తయారు చేసి... కెనడా నుంచి మన విదేశాంగ శాఖకు సమాచారం అందించింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కెనడా చర్యలు పూర్తిగా అసంబద్ధమని మండిపడింది. ఓటు బ్యాంక్‌ రాజకీయాలతో నడిచే ట్రూడో సర్కారు అజెండాకు అనుకూలంగా ఉన్నాయని మండిపడింది. రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి ఆధారాలు లేకుండా భారత మీద విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read: Arjun-Pawan Kalyan:అల్లు అర్జున్ పేరెత్తిన పవన్.. ఏమన్నాడో తెలుసా?

2018 నుంచి గొడవలు..

కెనడా ప్రధాని 2018 నుంచి భారత్‌తో ఎలాగో ఒకలా తగవులు పెట్టుకోవడానికే చూస్తున్నారని..అందుకు తగ్గట్టుగానే వేర్పాటువాదాన్ని ఎగదోసే వారిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారని ఆరోపించింది. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మకు 36ఏళ్ళ దౌత్య అనుభవం ఉందని విదేశాంగశాఖ తెలిపింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేంతవరకూ..ఇరు దేశాల మధ్యా పరిస్థితులు సరి అవవని విదేశాంగ శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది.  

Also Read: పడింది దెబ్బ..అదానీ ప్రాజెక్టుపై శ్రీలంక ప్రభుత్వం పున:పరిశీలన

దౌత్యవేత్తలు వెనక్కు..

తాజాగా కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలను ప్రభుత్వం వెనక్కు పిలిసిస్తున్నట్టు తెలుస్తోంది. కెనడాలోని ట్రూడో సర్కార్ మీద నమ్మకం లేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. అక్కడి దౌత్యవేత్తలకు భద్రత లేదని విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ తో పాటూ పలువురు దౌత్యవేత్తలను ‘పర్సన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’లుగా కెనడా పేర్కొనడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడాన్ని తాము ఆమోదించడం లేదని స్పష్టం చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ట్రూడో ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని తెలిపింది. మరోవైపు ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్యకేసులో భారత్‌కు ఆధారాలు ఇచ్చామని అంటున్నారు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్‌ వీలర్‌. ఈ వ్యవహారంలో భారత్‌తో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

Also Read: బుద్ధి పోనిచ్చుకోని కెనడా..అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త

 

Advertisment
Advertisment
తాజా కథనాలు