Canada Expled 6 Indian deiplomats:
అసలే రెండు దేశాల మధ్యనా పరిస్థితులు బాలేవంటే...కెనడా మరింత కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈరోజు ఉదయం భారత దౌత్య వేత్త సంజయ్ కుమార్ వర్మ పేరును అనుమానితుల లిస్ట్‌లో పెట్టినట్టు చెప్పిన కెనడా ప్రభుత్వం తాజాగా మరో దుందుడుకు చర్యకు పాల్పడింది.కెనడాలోని ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. వీరు దేశం విడిచి అక్టోబర్ 19 శనివారం లోపు వెళ్ళిపోవాలని చెప్పింది. దీంతో ఇరు దేశాల మధ్యనా దౌత్యపరమైన పరిస్థితులు మరింత ఉద్రిక్తతల్లోకి జారుకున్నాయి. బహిష్కరించిన వారిలో యాక్టింగ్ హై కమిషనర్ స్టీవర్ట్ రాస్ వీలర్ డిప్యూటీ హైకమీషనర్ పాట్రిక్ హెబర్ట్ తో పాటూ ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, ఇయాన్ రాస్ డేవిడ్ ట్రిట్స్, ఆడమ్ జేమ్స్ చుయిప్కా , పౌలా ఓర్జులా లు ఉన్నారు.
Also Read: పడింది దెబ్బ..అదానీ ప్రాజెక్టుపై శ్రీలంక ప్రభుత్వం పున:పరిశీలన
దౌత్యవేత్తలు వెనక్కు..
అంతకుముందు కెనడాలో ఉన్న దౌత్యవేత్తలను వెనక్కు పిలిపిస్తున్నట్టు భారత్ ప్రకటించింది. కెనడాలోని ట్రూడో సర్కార్ మీద నమ్మకం లేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. అక్కడి దౌత్యవేత్తలకు భద్రత లేదని విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ తో పాటూ పలువురు దౌత్యవేత్తలను ‘పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్’లుగా కెనడా పేర్కొనడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడాన్ని తాము ఆమోదించడం లేదని స్పష్టం చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ట్రూడో ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని తెలిపింది. మరోవైపు ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసులో భారత్‌కు ఆధారాలు ఇచ్చామని అంటున్నారు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్. ఈ వ్యవహారంలో భారత్‌తో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Also Read: బుద్ధి పోనిచ్చుకోని కెనడా..అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త