Donlad Trump-Indian IT:
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. మొదటి నుంచి ఈయనకు రిజల్ట్ అనుకూలంగానే కనబడుతోంది. కమలా హారిస్ వచ్చాక పరిస్థితి కాస్త టఫ్ అయినా కూడా ప్రస్తుతం ట్రంప్‌కే విన్నింగ్ ఛాన్సెన్ ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. మరో కొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఊఎస్‌లో సర్వేలో ఊపందుకున్నాయి. ఎవరు ఎక్కడ గెలుస్తారు. ఎవరు గెలిస్తే ఏంటి లాభం, నష్టం ఇలాంటి వాటి మీద జోరుగా అంనాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా ట్రంప్ గెలిస్తే భారత్ ఐటీ మీద దెబ్బ పడొచ్చని పరిశీలకులు చెబుతున్నారు.
Also Read: Ratan Tata: రతన్ టాటాతో చివర వరకూ ఉన్న టీటో..వీలునామాలో పేరు
ట్రంప విజయం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానిపై ఫిలిప్ క్యాపిటల్ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. రిపబ్లికన్ పార్టీ కనుక విజయం సాధిస్తే...ఇంతకు ముందులానే వీసాల ప్రాబ్లెమ్ మళ్ళీ షురూ అవుతుందని చెబుతున్నారు. వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయని.. ఇవి ఐటీ కంపెనీలకు సవాళ్లను విసురుతాయని అంటున్నారు. దీంతో అమెరికన్ కంపెనీలు...ఇండియా నుంచి ఉద్యోగులను తెప్పించుకోవడం మానేస్తాయని..స్థానికులనే నియమించుకుంటాయని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికన్ మార్కెట్‌లో భారత ఉద్యోగులకు డిమాండ్ తగ్గిపోయింది. కోవిడ్ తర్వాత కంపెనీలు చాలా మట్టుకు ఆన్‌సైట్ కు ప్రోత్సహించడం లేదు. ఇప్పుడు వీసాలను టైట్ చేసేస్తే...ఆ ఉన్న ఛాన్స్ కాస్తా మరింత తగ్గిపోతుది.
Also Read: Stock Market: మళ్ళీ మార్కెట్ ఢమాల్..సూచీలు 24, 200 దిగువకు
ఇక మరోవైపు ఆటోమొబైల్ రంగంలో కూడా భారత్ నుంచి విడిభాగాల ఎగుమతులు తగ్గుముఖం పట్టొచ్చని ఫిలిప్ క్యాపిటల్ సంస్థ చెబుతోంది. ట్రంప్ విద్యుత్తు వాహనాలకు ఇన్సెంటివ్‌లను తగ్గించే అవకాశాలుండటంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే వాటి స్పేర్‌పార్టులపై స్వల్పకాలం పాటు ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. అదే సమయంలో హైబ్రీడ్ వెహికల్ మార్కెట్ మాత్రం వృద్ధి చెందుతుందని అంటోంది. దీంతోపాటు ట్రంప్ భారీ ఇన్ఫ్రాప్లాన్లతో క్లాస్-8 శ్రేణి ట్రక్కులకు డిమాండ్ పెరగడం భారత ఆటోమొబైల్ స్పేర్ పార్టుల రంగానికి కలిసొస్తుందని చెప్పింది. ఇది కమోడిటీలు, లోహరంగానికి ఇన్ఫ్రాప్లాన్లు బలాన్నిస్తాయని తెలిపింది.