Hurricane Helene Storm in America: అమెరికాలోని నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా హెలెన్ తుఫాన్ ను ఎదుర్కొంటున్నాయి. వీటిలో ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాలు అతలాకుతాలం అవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 30 కి చేరుకుంది. ‘హెలెన్’ హరికేన్ ఫ్లోరిడా, జార్జియాతో సహా మొత్తం ఆగ్నేయ అమెరికాలో శుక్రవారం భారీ విధ్వంసం సృష్టించింది. నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం.. హెలెన్ హరికేన్ గురువారం రాత్రి 11:10 గంటలకు ఫ్లోరిడాలోని బిగ్ బెండ్ గ్రామీణ ప్రాంతంలో తీరాన్ని తాకినట్లు అధికారులు వివరించారు.
ఆ సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 225 కిలోమీటర్లు. హెలెన్ శుక్రవారం ఉదయం జార్జియాను తీవ్రంగా దెబ్బతీసింది. జార్జియాని తాకినప్పుడు దాని గాలి వేగం గంటకు 177 కిలోమీటర్లు. హెలెన్ హరికేన్ కారణంగా జార్జియా రోడ్లు అన్ని నీటిలో మునిగిపోయాయి. జార్జియాలో ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. అయితే దీని సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తుఫాను కారణంగా ఆగ్నేయ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
బలమైన గాలులు, ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హెలెన్ తుఫాను ఉత్తర దిశగా కదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తుఫాను రాకముందే ఫ్లోరిడాలో బలమైన గాలుల కారణంగా దాదాపు 9 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
ఎన్ డబ్ల్యూఎస్ అట్లాంటా, పరిసర ప్రాంతాలతో సహా సెంట్రల్ జార్జియాకు భారీ వరద హెచ్చరికలను జారీ చేసింది. ఈ ప్రాంతంలో 246 పాఠశాలలు, 23 ఆసుపత్రులు ఉన్నాయని, ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది నివాసితులు ప్రమాదంలో ఉన్నారని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫ్లోరిడా, జార్జియా, అలబామా, కరోలినాస్, వర్జీనియా గవర్నర్లు తమ తమ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని అధికారులు ప్రకటించారు.
తుఫానును ఎదుర్కొనేందుకు జార్జియా గవర్నర్ అదనపు బలగాలను, సహాయక సిబ్బంది మోహరించారు. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం, హెలీన్ హరికేన్ సౌత్ కరోలినాకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.