USA: అమెరికాలోని ఫ్లోరిడాను ముంచేస్తున్న హరికేన్

అమెరికాలోని ఫ్టోరిడా స్టేట్‌లోని పది కౌంటీలను హెలెన్ హరికేన్ భయపెడుతోంది. తీవ్రమైన గాలులు, వర్షాలు పడుతూ భీభత్సం సృష్టిస్తోంది. వరద నీటితో రోడ్లన్నీ నిండిపోయాయి. ఇళ్ళు, వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. 

New Update
usa

Helene Hurricane: 

మెక్సికో తీరంలో మొదలై అమెరికాలోని ఫ్లోరిడా దిశగా ప్రయాణిస్తున్న హెలెన్ హరికేన్ అమెరికాను భయపెడుతోంది. ఇది హరికేన్ కేటగిరి‌‌–3 లేదా కేటగిర–4 గా బలంగా మారే అవకాశం ఉందని యూఎస్ హరికేన్ సెంటర్ హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఫ్లోరిడాలోని తీర ప్రాంతాల వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పింది. ఇపటికే అక్కడ ఈదురు గాలులు, తీవ్ర వర్​సాలు పడుతున్నాయి. ఇవి మరింత ముదరక ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌సీ హెచ్చరిస్తోంది. హరికేన్ ప్రభావంతో ఫ్లోరిడా సిటీలో భీకర వర్షం పడింది. దీంతో  ఫ్లోరిడా రోడ్లన్నీ జలమయమయ్యాయి. కార్లు మునిగిపయేంత నీరు రోడ్ల మ​ఈదకు వచ్చి చేరింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు హెల్న్ ముదిరితే పెనుగాలుల ప్రభావంతో కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందని అమెరికా వాతారణ విభాగం హెచరిస్తోంది. 

 

 

 

Also Read: Maharashtra:రచ్చ అవుతున్న బద్లాపూర్ నిందితుడు ఎన్‌కౌంటర్

Advertisment
Advertisment
తాజా కథనాలు