Israel: కాంకర్ ది గలీలీకి హెజ్బుల్లా ప్లాన్–ఇజ్రాయెల్

గతేడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల తరహాలో మరో భారీ దాడికి హెజ్బుల్లా సిద్ధమైందని ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. దక్షిణ లెబనాన్ లో గ్రామాల్లోని ఇళ్ళను వాడుకుని దాడులు చేయడానికి సిద్ధమైందని ఆరోపించింది. 

war
New Update

Hezbollah Planned For Attack: 

హెజ్బుల్లా మా మీద దాడికి పెద్ద ప్లానే వేసింది అని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లోని లెబనాన్‌ గ్రామాలను దాడులకు స్థావరాలుగా మార్చుకుందని చెబుతోంది. ఈ మొత్తం పథకానికి కాంకర్‌ ద గలిలీ అని పేరుపెట్టింది అని చెబుతోంది ఇజ్రాయెల్. అక్టోబర్ 7 తరహా దాడులు చేసేందుకు హెజ్బుల్లా కుట్ర పన్నిందని తెలిపింది.  మా సరిహద్దుల్లో మరోసారి అక్టోబర్‌ 7 తరహా ఘటనలు జరగనీయమని ఐడీఎఫ్ ప్రతినిధి హగరీ అన్నారు.
2006లో ఐరాస తీర్మానం 1701 ప్రకారం లిటాని నది దక్షిణ భాగంలో...లెబనాన్ దక్షిణ భాగంలో హెజబ్ఉల్లా ఆయుధాలు పట్టుకుని తిరుగుతోంది.  హెజ్‌బొల్లా సైనిక మోహరింపులపై అక్కడ నిషేధం ఉందని తెలసినా ఆప ని చేస్తోందని హగరీ రోపించారు. ఈ ప్రాంతం లెబనాన్‌ దక్షిణ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందన్నారు. హెజ్బుల్లాను కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాలేదు. అందుకే తామే రంగంగలోకి దిగామని ఐడీఎఫ్ చెబుతోంది. 

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ భూతల దళాధిపతులు లెబనాన్‌లో అడుగు పెట్టారు. ఇజ్రాయెల్‌లో అత్యంత శక్తివంతమైన దళాల్లో ఒకటైన 98 పారా ట్రూపర్ కమాండోలు నిన్న రాత్రి దక్షిణ లెబనాన్‌లో ప్రవేశం చేశాయి. దీనికి బ్రిగేడియర్‌ జనరల్‌ గయ్‌లెవి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు డ్రోన్లు, విమానాలతో దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు సిద్ధమైంది. రిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. దీనికి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సరిహద్దు నుంచి 60 కి.మీ దూరంలో ఉంటున్న పౌరులంతా ఖాళీ చేయాలని అందులో చెప్పింది.

ఇక మరోవైపు ఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష దాడులకు తాము సిద్ధంగా ఉన్నామని హెజ్బుల్లా చెప్పింది. ఇజ్రాయెల్ సేనలు లెబనాన్‌లో ప్రవేశించాయన్నది అబద్ధమని హెజ్బుల్లా గ్రూప్ ప్రతినిధి మహమ్మద్ ఆసిఫి చెప్పారు. 

Also Read: Stock market: రోజంతా రోలర్ కోస్టర్..చివరికి ఫ్లాట్‌గా

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe