Hezbollah Attacks:
పేజర్లు, వాకీ టాకీల పేలుళ్ళు, తరువాత రాకెట్లతో దాడితో హెజ్బుల్లాను నాశనం చేయాలని చూసిన ఇజ్రాయెల్ మీదకు ఆ సంస్థ ప్రతీకార దాడులకు దిగింది. ఈరోజు ఇజ్రాయెల్ మీదకు 140 రాకెట్లను వదిలింది. జ్రాయెల్ హద్దుమీరిందని, ప్రతి దాడి ఉంటుందంటూ హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా ఆల్రెడీ చెప్పారు. అందుకు తగ్గట్టుగానే దాడులు చేస్తోంది హెజ్బుల్లా. ఉత్తర ఇజ్రాయెల్‌లోని మిలటరీ బ్యారెక్స్‌పై ఈ దాడులు జరిపినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ మిలటరీ సైతం ఈ దాడులను ధృవీకరించింది. దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతిగా రాకెట్లతో దాడులకు పాల్పడినట్లు తెలిపింది. లెబనాన్ సరిహద్దుల నుంచి మూడు దఫాలుగా రాకెట్లు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ మిటలరీ చెబుతోంది.
గత ఏడాది నుంచి పశ్చిమాసియాదేశాలు రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయి. హమాస్ ఉగ్రవాద సంస్థ మొదలుపెట్టిన యుద్ధం అలా పెరిగి పెద్దది అవుతూనే ఉంది. మొన్నటి వరకూ ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం చేసకున్నాయి. ఇప్పుడు ఇందులోకి హెజ్బుల్లా వచ్చి చేరింది. హమాస్‌కు హెజ్బుల్లా ఎప్పటి నుంచో సపోర్ట్‌గా నిలిస్తూనే ఉంది. ఇజ్రాయెల్– హమాస్ల మధ్య వార్ జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలోకి వచ్చి వెళుతుండేది. అయితే ఇప్పుడు ఈ సంస్థ కూడా నేరుగా యుద్ధంలోకి దిగింది. ఇజ్రాయెల్ కూడా లెబనా, హిజ్బుల్లా లను లక్ష్యంగా చేసుకుని దాడులను చేస్తోంది. ముందు ఇజ్రాయెల్ ఏ అగ్నికి ఆజ్యం పోస్తూ లెబనాన్ లో హిజ్బుల్లా సంస్థ పేజర్లు, వాకీ టాకీలను పేల్చింది. తరువాత రాకెట్లతో దాడులు కూడా చేసింది. ఇప్పుడు దానికి ప్రతీకారంగా హిబుల్లా దాడులకు దిగింది.