Hamas:
హమాస్ అధినేత యహ్యా సిన్వర్ చనిపోయారని హమాస్ సైతం ధృవీకరించింది. అంతకు ముందు మరో అధిపతి ఇస్మాయెల్ హనియె కూడా ఇజ్రాయెల్ ను కూడా ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. దీంతో హమాస్ అన్ని రకాలుగా నాశనం అయింది. ఒక రకంగా చెప్పాలంటూ పూర్తిగా నామరూపల్లేకుండా అయిపోయింది. ముఖ్య, కీలక నేతలందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే హమాస్ సంస్థ మాత్రం ఏం జరిగినా తగ్గేదే లేదు అంటోంది. ఎవరు చనిపోయినా ఇజ్రాయెల్ పౌరులను వదిలిపెట్టమని తెగేసి చెబుతున్నారు హమాస్ డిప్యూటీ చీఫ్ ఖలీల్ అల్-హయ్యా. ఐడీఎఫ్ గాజాను పూర్తిగా విడిచిపెట్టడమే కాకుండా దాడులను, యుద్ధాన్ని మొత్తం ఆపేంతవరకూ బందీలను విడిచి పెట్టమని చెప్పారు. సిన్వార్ మరణం తర్వాత హమాస్ చీఫ్ పదవికి పోటీలో హమాస్ వ్యవస్థాపకుడు మరియు సీనియర్ సభ్యుడు మహమూద్ అల్-జహర్, యాహ్యా సోదరుడు మహ్మద్ సిన్వార్ ఉన్నారు.
Also Read: Byju's: కోట్ల నుంచి సున్నాకు..బైజూస్ పతనం
బందీలను విడిచిపెడితేనే..
అయితే మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇదే మాట అంటోంది. హమాస్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయే వరకూ యుద్ధాన్ని ఆపేదే లేదని చెబుతున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. ఇప్పటికే వారి కీలకనేతలను, చాలా మంది సభ్యులను మట్టుబెట్టాం...ఇంకా కొంతమందే ఉన్నారు. వారినికూడా అంతం చేస్తామని చెబుతున్నారు. అయితే సిన్వార్ చావు యుద్ధం అంతానికి మొదటి మెట్టని ప్రధాని నెతన్యాహు అన్నారు. తమ బందీలను విడిచిపెట్టి యుద్ధాన్ని ఆపేస్తామని నెతన్యాహు సందేశం పంపారు.
Also Read: Stock Market:ఎట్టకేలకు లాభాల్లో సూచీలు..కాస్త మెరుగ్గా మార్కెట్
ఇజ్రాయెల్ సంబరాలు..
ఇజ్రాయిల్ మోస్ట్ వాంటెడ్ హమాస్ లీడర్, సంస్థ చీఫ్ యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ హతమార్చింది. అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న సిన్వార్ ను ఇజ్రాయెల్ పదేళ్ళ నుంచీ వెతుకుతోంది. అత్యంత రహస్యంగా గాజాలోని భూగర్భ టన్నెల్స్‌లో తన భార్య, పిల్లలతో నివాసం ఉండే సిన్వార్ చివరకు కొత్తగా సైన్యంలో చేరిన సైనికులు అంటే.. కేవలం ఇజ్రాయిల్ ఆర్మీలో 9 నెలల క్రితమే చేరిన 20 ఏళ్ల లోపు యువకుల చేతిలో హతమయ్యాడు. అది కూడా అతి మామూలు షెల్ దాడిలో. దీంతో ఇజ్రాయెల్ సంబరాలు జరుపుకుంటోంది.
Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!