తొలిసారిగా డిజిటల్ కండోమ్ యాప్.. ప్రైవసీకి ఇక భయమే లేదు!

జర్మనీకి చెందిన బిల్లీ బాయ్ అనే కంపెనీ మొదటిసారిగా డిజిటల్ కండోమ్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రైవేట్ సమయాల్లో ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు ఈ యాప్‌ను తీసుకొచ్చారు.

Digital condome
New Update

ప్రస్తుతం మార్కెట్లో డిజిటల్ కండోమ్ బాగా వినిపిస్తోంది. చాలామందికి ఈ డిజిటల్ కండోమ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఈ డిజిటల్ కండోమ్ అనేది ప్రైవసీ నుంచి కాపాడేది. అంటే ప్రైవేట్ సమయంలో మీ ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు వాడే యాప్‌ ఇది. ఈ డిజిటల్ కండోమ్ యాప్‌ను జర్మనీకి చెందిన బిల్లీ బాయ్ అనే కంపెనీ లాంచ్ చేసింది. 

ఇది కూడా చూడండి: జగన్‌, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్!

ప్రైవసీకి భంగం కలగకుండా..

ప్రైవేట్ సమయాల్లో మీ అనుమతి లేకుండా ఏం రికార్డు చేయలేరు. కనీసం వాయిస్‌ను కూడా రికార్డు చేయలేరు. ఈ మధ్య కాలంలో వీడియో కాల్‌ రికార్డింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారందరికి ఇక విముక్తి కలిగినట్లే. ఈ యాప్ వాడితే ఇలాంటి సమస్యలే ఉండవు. అయితే దీన్ని బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా వాడాలి. దీనిని వాడుతున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ కెమెరా, మైక్రోఫోన్‌ను ఆపివేస్తుంది.

ఇది కూడా చూడండి: Breaking: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు..

దీనివల్ల వ్యక్తిగత విషయాలను ఎదుటవారు రికార్డు చేయలేరు. ఒకవేళ ఎవరైనా వీడియోను రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే తప్పకుండా హెచ్చరికలు జారీ చేస్తుంది. అలారం మోగినట్లు సౌండ్ వినిపిస్తుంది. ఈ డిజిటల్ కండోమ్ యాప్ ద్వారా ఒకేసారి వేర్వేరు డివైజ్‌లోని కెమెరా, మైక్రోఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు. 

ఇది కూడా చూడండి: అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా..

ఈ యాప్ వల్ల ప్రజల ప్రైవసీకి భంగం వాటిల్లదు. అయితే ఈ యాప్ ప్రజల వ్యక్తిగత విషయాలకు బాగా ఉపయోగపడుతుందని భావించి కొందరు ప్రశంసిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం వేస్ట్ యాప్ అని అంటున్నారు. ప్రస్తుతం 30కి పైగా దేశాల్లోని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుందని బిల్లీ బాయ్ కంపెనీ  తెలిపారు. 

ఇది కూడా చూడండి: ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య

#germany
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe