/rtv/media/media_files/2025/09/19/french-president-2025-09-19-07-47-42.jpg)
ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగిట్టేమాక్రాన్ పై కొద్దిరోజులుగా వస్తున్న ఆరోపణలను ఎదుర్కొనేందుకు వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రిగిట్టే వాస్తవానికి జీన్-మిచెల్ అనే పురుషుడని, ఆ తర్వాత లింగమార్పిడి చేయించుకుని మహిళగా మారిందని అమెరికా ఇన్ఫ్లుయెన్సర్కాండీస్ ఓవెన్స్ చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలు కేవలం పుకార్లు మాత్రమేనని ఫ్రాన్స్ అధ్యక్ష దంపతులు కొట్టి పారేసినా, ఓవెన్స్ తన ప్రచారాన్ని ఆపలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని కోర్టుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
French President Emmanuel Macron and his wife Brigitte plan to present “photographic and scientific evidence” in an American court to prove that Mrs. Macron is a woman.
— Visegrád 24 (@visegrad24) September 18, 2025
The French president and his wife filed a defamation lawsuit against American influencer Candace Owens, who… pic.twitter.com/ZLWS9SyHnB
బ్రిగిట్టేమాక్రాన్ ఓ మహిళే అని నిరూపించేందుకు శాస్త్రీయ ఆధారాలు, ఫోటోలు కోర్టులో ప్రవేశపెడతామని మాక్రాన్దంపతులు ప్రకటించారు. అమెరికాలోని డెలావేర్ కోర్టులో ఓవెన్స్ పై పరువు నష్టం కేసు వేసినట్లు ఆయన తెలిపారు. బ్రెగ్గిట్టే గర్భవతిగా ఉన్నప్పటిఫోటోలు, పిల్లలను పెంచినప్పటిఫోటోలను కోర్టులో సమర్పిస్తామని వారి తరపు లాయర్ చెప్పారు. ఓవెన్స్ చేసిన ప్రచారం మానసికంగా చాలా బాధ కలిగించిందని, అధ్యక్షుడి విధులకు ఇవి అడ్డంకిగా మారాయని న్యాయవాది క్లారే తెలిపారు.
అధ్యక్ష దంపతులు ప్రపంచ వేదికపై ఎంతో ముఖ్యమైనవారు అయినప్పటికీ, వారు కూడా మానవ మాత్రులేఅని ఆయన అన్నారు. ఇటువంటి నిందలు వారిని మానసికంగా కృంగదీస్తాయని తెలిపారు. నిజానికి జీన్-మిచెల్ అనేది బ్రిగిట్టే సోదరుడి పేరు. అయినప్పటికీ, ఓవెన్స్ అసంబద్ధమైన ఆరోపణలను కొనసాగిస్తోంది. వాస్తవాలను తెలియజేయాలని చేసిన అనేక అభ్యర్థనలను ఆమె పెడచెవిన పెట్టడంతో న్యాయపరమైన చర్యలు తీసుకోవడమే చివరి మార్గంగా మాక్రాన్ దంపతులు భావించారు. ఈ కేసు ద్వారా తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసి, నిజం ప్రపంచానికి తెలియజేయాలన్నదే తమ లక్ష్యం అని న్యాయవాది పేర్కొన్నారు.