Indian-Origin Family : అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు మృతి

అమెరికాలో అదృశ్యమైన నలుగురు భారత సంతతి వృద్ధులు కారు ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులను డాక్టర్ కిషోర్ దివాన్ (89), ఆశా దివాన్ (85), శైలేష్ దివాన్ (86), గీత దివాన్ (84) గా గుర్తించారు.

New Update
family us

అమెరికాలో అదృశ్యమైన నలుగురు భారత సంతతి వృద్ధులు కారు ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులను డాక్టర్ కిషోర్ దివాన్ (89), ఆశా దివాన్ (85), శైలేష్ దివాన్ (86), గీత దివాన్ (84) గా గుర్తించారు. వీరంతా న్యూయార్క్ నగరానికి చెందినవారు."న్యూయార్క్‌లోని బఫెలో నుండి తప్పిపోయినట్లు నివేదించబడిన నలుగురు వ్యక్తులు వాహన ప్రమాదంలో మరణించినట్లు మార్షల్ కౌంటీ షెరీఫ్ మైక్ డౌగెర్టీ ధృవీకరించింది. బాధితులను డాక్టర్ కిషోర్ దివాన్, శ్రీమతి ఆశా దివాన్, శ్రీ శైలేష్ దివాన్ మరియు శ్రీమతి గీతా దివాన్‌గా గుర్తించారు" అని షెరీఫ్ కార్యాలయం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.  

సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్

జూలై 29న న్యూయార్క్‌లోని బఫెలో నుంచి బయలుదేరిన వీరు  వెస్ట్ వర్జీనియాకు వెళ్తున్న సమయంలో కనిపించకుండా పోయారు.  పెన్సిల్వేనియాలోని ఎరీలో ఉన్న ఒక బర్గర్ కింగ్ రెస్టారెంట్‌లో వీరు చివరిసారిగా కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది.ఆగస్టు 2వ తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో, మార్షల్ కౌంటీలోని బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్ సమీపంలో వీరి లేత ఆకుపచ్చ టయోటా కామ్రీ కారు లోయలో పడి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఆలయానికి కేవలం ఐదు మైళ్ళ దూరంలోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మార్షల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం దర్యాప్తు జరుపుతోంది.

అమెరికాలో రోడ్డు ప్రమాదాలు 

ఇదిలాఉండగా అమెరికాలో రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఇలా పలువురు వివిధ రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. అమెరికాలో చాలాప్రాంతాల్లో వేగ పరిమితులు ఎక్కువగా ఉంటాయి. చాలా వేగంతో ప్రయాణించడం, ట్రాఫిక్ రూల్స్‌ సరిగా పాటించకపోవడం అనేవి ఈ రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది.  కొన్ని సందర్భాల్లో ప్రయాణంలో అలసిపోవడం, మొబైల్ ఫోన్ వాడటం, వంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.  

ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. వాళ్లు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొని వంతెన మీద నుంచి కింద పడిపోవడంతో ఈ దారుణ చోటుచేసుకుంది. మరోవైపు డాలస్‌లోని హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారులో మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనమయ్యారు. ఆ కుటుంబ సభ్యులు అట్లాంటా నుంచి డాలస్‌కు వెళ్తుండగా వారి కారును ఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  

Advertisment
తాజా కథనాలు