ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

ప్రతీ ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది పర్యాటకం & శాంతి అనే థీమ్‌తో పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఈ ఏడాది జార్జియా దేశం ఆతిధ్యం ఇస్తోంది.

wtd
New Update

World Tourism Day 2024: ఆర్థిక అభివృద్ధిని పెంచడంలో పర్యాటక రంగం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. పర్యాటక రంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 1980 నుంచి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రతీ ఏడాది కొత్త థీమ్‌తో ఘనంగా జరుపుకుంటున్నారు. 

దీని చరిత్ర?

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని 1980లో మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థను స్థాపించింది. 1979లో దీనికోసం ప్రతిపాదన తీసుకురాగా.. 1980లో దీనిని అమలు చేశారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 

ఈ ఏడాది థీమ్?

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకం & శాంతి అనే థీమ్‌తో ఈ ఏడాది వరల్డ్ టూరిజం డేను జరుపుకుంటున్నారు. పర్యాటక రంగంలో ఉద్యోగాలు సృష్టించడం, సాంస్కృతికంగా ఏవైనా అంతరాలు ఉంటే తొలగించడం, ఆర్థిక వ్యవస్థను బలపర్చడం, టూరిజంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతీ ఏడాది ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఈ ఏడాది జార్జియా దేశం నిర్వహిస్తోంది. ప్రతీ ఏడాది ఒక్కో దేశం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

పర్యాటక దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలంటే?

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, టూరిజం డిపార్ట్‌మెంట్‌లో సమావేశాలు, సెమినార్లు నిర్వహించడం, పర్యాటక రంగంపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం వంటివి చేస్తుంటారు. వీలైతే మీకు దగ్గరగా ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లను సందర్శించవచ్చు. 

తెలంగాణలో సందర్శించాల్సిన ప్రదేశాలు

తెలంగాణలో సందర్శించాల్సిన ముఖ్యమైన వాటిలో వరంగల్, వేములవాడ, రామోజీ ఫిల్మ్ సిటీ, గోల్కొండ కోట, నాగార్జున సాగర్, యాదగిరిగుట్ట, భద్రాచలం, మెదక్ చర్చ్, మల్లెల తీర్థం, రామప్ప దేవాలయం, హుస్సేన్ సాగర్, సాలార్జంగ్ మ్యూజియం, అనంతగిరి కొండలు, చార్మినార్, కేబుల్ బ్రిడ్జ్, నెహు జూలాజికల్ పార్క్, తాజా ఫలక్‌నుమా ప్యాలెస్, రామగిరి, సోమశీల, బొగత జలపాతం, స్వర్ణగిరి వంటి అందమైన ప్రదేశాలు ఉన్నాయి. 

#tourism
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి