Bullet Train: డ్రైవర్లు లేకుండా బుల్లెట్‌ రైళ్లు..ఎక్కడో తెలుసా?

2030 నాటికి జపాన్‌ లో డ్రైవర్లు లేకుండా బుల్లెట్‌ రైళ్లు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు.తూర్పు జపాన్‌ రైల్వేలో తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టనున్నారు. 2028 నాటికి ఓ మార్గంలో నడిచే రైళ్లలో డ్రైవర్‌ సేవలు పూర్తిగా ఆటోమేటెడ్‌ కానున్నాయని నిర్మాణ సంస్థ పేర్కొంది.

author-image
By Bhavana
New Update
bulet train

Bullet Train: జపాన్‌ అనగానే మనకు ముందుగా అందరికీ గుర్తొచ్చేది బుల్లెట్‌ రైలు. సురక్షిత ప్రయాణం, సమయపాలనకు ఇది పెట్టింది పేరు. శరవేగంగా దూసుకుపోయినా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. 2030 నాటికి జపాన్‌ లో డ్రైవర్లు లేకుండా బుల్లెట్‌ రైళ్లు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. 

తూర్పు జపాన్‌ రైల్వేలో తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టనున్నారు. 2028 నాటికి ఓ మార్గంలో నడిచే రైళ్లలో డ్రైవర్‌ సేవలు పూర్తిగా ఆటోమేటెడ్‌ కానున్నాయని…అయినప్పటికీ డ్రైవర్లు క్యాబిన్‌ లోనే అందుబాటులో ఉంటారని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఆ తరువాత ఏడాది నుంచి డ్రైవర్‌ రహిత రైళ్ల ట్రయల్‌ రన్‌ నిర్వహించి 2030 మధ్య నాటికి టోక్యో-నిగాటా మధ్య జోట్సు మార్గంలో పూర్తి స్థాయి డ్రైవర్‌ లెస్‌ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు కంపెనీ తెలిపింది.

కార్మికుల కొరత వంటి సమస్యలను తీర్చడంలో ఈ రైళ్లు సహాయపడతాయని రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. జపాన్‌ లో జనాభా క్షీణిస్తుండటంతో ఇప్పటికే అక్కడి అనేక రంగాలు కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

దేశంలో జనాభా తగ్గుతున్న నేపథ్యంలో డ్రైవర్‌ లెస్‌ ట్రైన్లను తీసుకురావడం రైల్వే నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడం ఎంతో ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. రైల్వే లో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉండాలని భావిస్తున్నారు. డ్రైవర్‌ లెస్‌ సేవలు కార్మికుల కొరత, ఇతర సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయని రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. 

జపాన్‌ లో జనాభా క్షీణిస్తుండటంతో ఇప్పటికే అక్కడి ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలు కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక జపాన్‌ లో బుల్లెట్‌ రైలును షింకాన్‌ సెన్‌ అని పిలుస్తారు. షింకాన్‌ సెన్‌ అంటే జపనీస్‌ భాషలో కొత్త ట్రంక్‌ లైన్‌ అనే అర్థం వస్తుంది. 

అతి త్వరలోనే భారత్‌ లో కూడా బుల్లెట్‌ రైళ్లను పరుగులు పెట్టేంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఈ క్రమంలోనే దీని కోసం మోదీ ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది. 2030 కల్లా దేశంలో బుల్లెట్‌ రైలును పరుగులు పెట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Also Read: ట్రంప్‌ టోపీ పెట్టుకున్న బైడెన్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు