/rtv/media/media_files/2024/11/26/hot6qWwbusov6eg7AXoT.jpg)
Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. బందీల విడుదల విషయంలో హమాస్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేలోపు బందీలను విడుదల చేయాల్సిందేనని.. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హమాస్‌కు హెచ్చరించారు. గత 14 నెలలుగా హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించి, పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకడంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే.
Also Read: Actress: బీచ్‌లో యోగా చేస్తుండగా..హీరోయిన్ ని లాక్కెళ్లిన రాకాసి అల!
ఈ నేపథ్యంలో హమాస్‌కు ట్రంప్ హెచ్చరికలు చేయడం గమనార్హం.‘పశ్చిమాసియాలో మానవత్వానికి వ్యతిరేకంగా దురాగతాలకు పాల్పడినవారు జనవరి 20 అంటే నేను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేలోగా బందీలను విడుదల చేయకుంటే భారీ మూల్యం చెల్లించుకుంటారు.. దీనికి బాధ్యులపై ఇప్పటి వరకూ అమెరికా ఎవరి పైనా చేయని దాడిని ఎదుర్కొంటారు’ అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో హెచ్చరించారు. ఇదే సమయంలో జో బైడెన్ తీరును విమర్శించిన ఆయన.. ఇజ్రాయేల్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలిపారు.
Also Read: Punjab:మాజీ డిప్యూటీ సీఎం కి టాయిలెట్లు కడిగే శిక్ష..ఎందుకో తెలుసా!
అయితే ప్రపంచ వేదికపై ఒప్పందం చేసుకోవాలనే తన కోరికను ట్రంప్ బయటపెట్టారు.గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయేల్‌లోకి చొరబడిన హమాస్ సాయుధులు.. మారణహోమానికి పాల్పడ్డారు. 1,200 మందిని కిరాతకంగా చంపి.. 250 మందిని బందీలుగా చేసుకున్నారు. వీరిలో కొందర్ని విడుదలు చేయగా.. కొందరు చనిపోయారు. ఇంకా 97 మంది హమాస్ చెరలో ఉన్నారు. హమాస్ నరమేథానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ యుద్దం ప్రకటించింది. గత 14 నెలలుగా సాగుతోన్న ఇజ్రాయేల్-హమాస్ యుద్దంలో ఇప్పటి వరకూ 44,429 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ప్రకటించింది.
Also Read: Chennai: కొండ చరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
ఇక, హమాస్ చెర నుంచి బందీల విడుదలకు పలు దఫాలుగా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. కానీ, అవి సత్ఫలితాలను ఇవ్వలేదు. అటు, కాల్పుల విరమణకు ఖతార్, అమెరికా, ఫ్రాన్స్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఇటీవల హెజ్బొల్లా, ఇజ్రాయేల్ మధ్య 2 నెలల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.