Astronomical Event : ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!

సీ/2023 ఏ3 తోకచుక్క సెప్టెంబరు 28, 2024న సూర్యుడికి దగ్గరగా వచ్చింది ఆ రోజు నుంచి సూర్యుడికి దూరంగా కదలడం ప్రారంభించింది. ఈ తోకచుక్క అరుదైన ఖగోళ విశేషమని, మరో 80,000 సంవత్సరాల వరకు ఇది కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

cmet
New Update

అద్భుత ఖగోళ దృశ్యాలను చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపించే భారత ఔత్సాహికులకు ఓ శుభవార్త. మరో అరుదైన ఖగోళ దృశ్యం వినీలాకాశంలో  కనువిందు చేయనుంది. జనవరి 2023లో గుర్తించిన సీ/2023 ఏ3 అనే తోకచుక్క ప్రస్తుతం భారత్ నుంచి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఔత్సాహికులు దీనిని సాధారణ కళ్లతో కూడా చూడవచ్చని, మసకబారిన బంతిలా కనపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే టెలిస్కోప్‌తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

Also Read: దేనితో కొట్టాలి రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్!

80,000 సంవత్సరాల..

సీ/2023 ఏ3 తోకచుక్క సెప్టెంబరు 28, 2024న సూర్యుడికి దగ్గరగా వచ్చింది ఆ రోజు నుంచి సూర్యుడికి దూరంగా కదలడం ప్రారంభించింది. అందుకే ప్రస్తుతం భూమి నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తోకచుక్క అరుదైన ఖగోళ విశేషమని, మరో 80,000 సంవత్సరాల వరకు ఇది కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ దశాబ్దకాలంలో ఇదే అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క అని వివరించారు.

Also Read:  Priyanka Chopra భర్తకు ప్రమాదం..? షో మధ్యలోనే పారిపోయిన నిక్!

భారతదేశం అంతటా ఈ తోకచుక్క కనిపిస్తోంది. అక్టోబర్ 14-24 మధ్య ఇది మరింత స్పష్టంగా  కనపడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు సూర్యోదయానికి ముందు తెల్లవారుజాము సమయం ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచించారు. ఇక అక్టోబర్ 12 నుంచి ఈ తోకచుక్క సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ దిశలో కూడా కనపడుతుందని వివరించారు.

Also Read:  మోదీకి లోకేష్ సారీ చెప్పడంపై షర్మిల విమర్శల దాడి

ఈ తోకచుక్కకు సంబంధించి ఖగోళ ఫోటోగ్రాఫర్లు, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు తీసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి కొందరు ఈ ఫొటోలు తీశారు. ఈ చిత్రాలలోని తోకచుక్క పొడవాటి తోకతో మెరుస్తూ కనిపిస్తోంది. అయితే భారతదేశంలో ప్రస్తుతం ఆకాశం స్పష్టంగా ఉన్న లడఖ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి తోకచుక్క స్పష్టంగా కనపడుతుందన శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read: 'అఖండ 2 - తాండవం'... మాస్ డైలాగ్ తో ఇరగదీసిన బాలయ్య.. వీడియో వైరల్

#astronomical-event
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe