Canada: భారతీయ విద్యార్థులకు కెనడా బిగ్‌ షాక్‌!

కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం మరోసారి షాక్‌ ఇచ్చింది. ఈ ఏడాది స్ట‌డీ ప‌ర్మిట్ల‌ సంఖ్య తగ్గించిందని సమాచారం. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత్‌ నుండి స్టడీ పర్మిట్ల ఆమోదాలు సగానికి తగ్గాయని అక్కడి నివేదికలు వెల్లడించాయి.

author-image
By Bhavana
భారతీయ విద్యార్థులకు కెనడా బిగ్‌ షాక్‌!
New Update

Canada Study Visa :

కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం మరోసారి పెద్ద షాకిచ్చింది. ఇప్పటికే విదేశీ విద్యార్థుల వార‌పు ప‌నిగంట‌ల‌ను జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం త‌గ్గించిన సంగతి తెలిసిందే. దీంతో అక్క‌డ ఉన్న భారతీయ విద్యార్థుల పై ఆర్థిక భారం పెరిగింది. ఇప్పుడు ఈ ఏడాది ఇండియ‌న్ స్టూడెంట్స్‌ స్టడీ పర్మిట్ ఆమోదాలు దాదాపు 50శాతం మేర‌ తగ్గుతాయని కెన‌డా ఎడ్యుకేష‌న్ టెక్నాల‌జీ కంపెనీ అప్లైబోర్డ్ నివేదిక తెలిపింది. 

2018, 2019లో వ‌చ్చిన‌ విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో కెనడియన్ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. దీంతో ఈ ఏడాది స్ట‌డీ ప‌ర్మిట్ల‌ ఆమోదాల క్షీణత ఏర్పడింద‌ని సమాచారం. “ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత్‌ నుండి స్టడీ పర్మిట్ల ఆమోదాలు సగానికి తగ్గాయి” అని నివేదిక వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో అంతర్జాతీయ విద్యార్థులను అనుసంధానించే సంస్థ అప్లైబోర్డ్‌ నివేదిక. 2023లో ఆమోదించిన విదేశీ విద్యార్థుల స్ట‌డీ వీసాల సంఖ్య 4,36,000గా ఉంది. కానీ, 2024లో ఇప్ప‌టివ‌ర‌కు కేవలం 2,31,000గా ఉందని నివేదిక వెల్లడించింది.

దీని ప్ర‌కారం 2023తో పోలిస్తే 2024లో కెనడియన్ స్టడీ పర్మిట్‌ల కోసం గ్లోబల్ అప్లికేషన్‌లలో 39శాతం తగ్గుదల ఉంద‌ని నివేదిక అంచనా వేసింది. ఇక 2022లో 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులలో 2.26 లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడాలోనే ఉన్నారు. అలాగే 3.2 లక్షల మంది భారతీయులు స్టూడెంట్ వీసాలపై కెనడాలో ఉంటూ గిగ్ వర్కర్లుగా ఆ దేశ‌ ఆర్థిక వ్యవస్థకు సహకరించారు.

అంతర్జాతీయ విద్యార్థులకు ఆర్థిక అవసరాలను పెంచేలా కెనడియన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు చాలా మంది భావి విద్యార్థులను నిరుత్సాహపరిచాయని అప్లైబోర్డు సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మేటి బసిరి అన్నారు. ” కెనడా ఒకప్పుడు అంతర్జాతీయ విద్యార్థులకు స్వాగతించిన విధంగా ఇటీవ‌ల కాలంలో ఆ ప‌రిస్థితులు కనిపించడం లేదు” అని ఆ నివేదికలు పేర్కొన్నాయి.

దాంతో చాలామంది విదేశీ విద్యార్థులు ఇప్పుడు కెన‌డాకు స్టడీ ప‌ర్మిట్ల కోసం దరఖాస్తు చేయ‌డం లేదు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఇతర గమ్యస్థానాలను తమ విద్యను అభ్యసించేందుకు ఎంచుకుంటున్నారు.

Also Read :  మరికాస్త తగ్గిన బంగారం ధర.. వెండి ధర పరుగు!
#canada #indian-students #visa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe