Earth Quake: తీవ్ర భూకంపం...6.5 తీవ్రతగా నమోదు!

కెనడా తీర ప్రాంతంలోని బ్రిటీష్ కొలంబియాలోని ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది.రిక్టార్ స్కేల్‌ పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశాలు లేవని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది

New Update
earthquake

EarthQuake: కెనడా తీర ప్రాంతంలోని బ్రిటీష్ కొలంబియాలోని ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, రిక్టార్ స్కేల్‌ పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. బ్రిటీష్ కొలంబియాలోని అతిపెద్ద నగరమైన వాంకోవర్‌కు ఉత్తరాన 1,720 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైడా గ్వాయి అనే ద్వీప సమూహంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జీఎస్‌ తెలిపింది.

ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశాలు లేవని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు భూకంపం వల్ల పెద్దగా నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అయితే భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారని, ప్రకంపనలు బలంగా ఉన్నాయని, అయితే ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదని అధికారులు తెలిపారు. 

మధ్యాహ్నం 3 గంటలకు భూకంపం వచ్చినట్లు కెనడా నేచురల్ రిసోర్సెస్ ప్రకటించింది. భూకంప ప్రకంపనలు ఒకసారి కాదు రెండుసార్లు సంభవించాయని, అందులో ఒకటి బలంగా ఉందని, దీని తీవ్రత 6గా, రెండవది స్వల్పంగా ఉందని, దీని తీవ్రత 4.5గా నమోదైందని ఆయన వివరించారు.

Also Read: జోగి ఇంటి ముందు అత్యుత్సాహం ప్రదర్శించిన యువకులు!

Advertisment
తాజా కథనాలు