Israel Fresh Attack On Iran : ఇరాన్‌ పై బాంబుల వర్షం..చిగురుటాకులా వణికిన టెహ్రాన్‌

రాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో టెహ్రాన్‌ ఒక్కసారిగా వణికిపోయింది.తాజా దాడిలో 20 మంపౌరులు మరణించారు, టెహ్రాన్‌లోని ప్రధాన చమురు డిపోపై కూడా దాడి జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ మిస్సైళ్లు టెహ్రాన్‌ను తగలబెట్టేస్తున్నాయి.

New Update
FotoJet (21)

Israel Fresh Attack On Iran

Israel Fresh Attack On Iran : ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో టెహ్రాన్‌ ఒక్కసారిగా వణికిపోయింది.తాజా దాడిలో 20 మంపౌరులు మరణించారు, టెహ్రాన్‌లోని ప్రధాన చమురు డిపోపై కూడా దాడి జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ మిస్సైళ్లు టెహ్రాన్‌ను తగలబెట్టేస్తున్నాయి. ఈరోజు మధ్యప్రాచ్య యుద్ధం తొమ్మిదవ రోజు. గత ఎనిమిది రోజులుగా వినాశకరమైన విధ్వంసం జరిగింది. అయినా అమెరికా, ఇరాన్ , ఇజ్రాయెల్ లు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈరోజు ఇరాన్‌పై విధ్వంసకర దాడి జరుగుతుందని ట్రంప్ ముందే హెచ్చరించారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌పై 80 ఫైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌జెట్స్​తో ఇజ్రాయెట్‌బాంబుల వర్షం కురిపించింది.‌‌‌‌‌‌‌టెహ్రాన్‌లో అమెరికా -ఇజ్రాయెల్ దాడిలో 20 మంది ఇరానియన్ పౌరులు మరణించారు. టెహ్రాన్‌లోని IRGC బేస్ క్యాంప్‌ను  ఇజ్రాయెల్ పేల్చేసింది. -- ట్రెహాన్‌లోని ఫ్యుయల్ స్టోరేజ్‌ ట్యాంకులు భారీగా ధ్వంసమయ్యాయి.టెహ్రాన్ చమురు శుద్ధి కర్మాగారం భారీగా దెబ్బతింది. -- ఇజ్రాయెల్ దాడిలో  టెహ్రాన్ పోలీస్ స్టేషన్ కాలిబూడిదైంది.-- రాత్రంతా టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈ వివాదం ఫలితంగా ఇప్పటివరకు ఇరాన్‌లో 1,230 మంది, లెబనాన్‌లో 290 మంది మరియు ఇజ్రాయెల్‌లో దాదాపు డజను మంది మరణించారు.

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధన ట్యాంకులపై డ్రోన్ దాడులు జరిగాయని కువైట్ సాయుధ దళాలు వివరించాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ, ఈ దాడి దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను నేరుగా లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం అని అన్నారు. కువైట్ సైన్యం ఈ సంఘటన గురించి సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేసింది. కాగా, ఇరాన్ సమస్యకు సంబంధించినంత వరకు అన్ని పక్షాలు చర్చలు జరపాలని చైనా కోరింది. బలప్రయోగం ద్వారా పరిష్కారం సాధ్యం కాదని చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ప్రధాన శక్తులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. అన్ని పక్షాలు వీలైనంత త్వరగా చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరాలన్నారు.

కాగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజాని మాట్లాడుతూ, "చాలా మంది అమెరికన్ సైనికులను ఇరాన్‌ ఖైదీలుగా తీసుకున్నట్లు నాకు సమాచారం అందింది, కానీ వారు యుద్ధంలో మరణించారని అమెరికా చెబుతోంది. ఎంత ప్రయత్నించినా, అమెరికా ఎక్కువ కాలం సత్యాన్ని దాచలేకపోయింది" అని ఎద్దేవా చేశారు. మరోవైపు ఇరాన్ కూడా బహ్రెయిన్‌పై దాడి చేసింది. ఇరానియన్ మినా సల్మాన్ సమీపంలోని ఒక స్థలాన్ని లక్ష్యంగా చేసుకుందని, అక్కడ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తోందని ప్రభుత్వం తెలిపింది. కువైట్‌లో డ్రోన్ దాడిలో మరణించిన ఆరుగురు అమెరికన్ సైనికుల మృతదేహాలను స్వయంగా స్వీకరించడానికి ట్రంప్ ఈరోజు డెలావేర్‌లోని డోవర్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నారు. వారి త్యాగాన్ని గౌరవించడంతో పాటు వారికి నివాళులు అర్పించనున్నారు.ఇరాన్ తాజా దాడుల తర్వాత, గల్ఫ్ దేశాల్లో మరింత ఉద్రిక్తంగా పెరుగుతోంది. సౌదీ అరేబియా, దాని ఇంధన రంగంపై ఇరాన్ నిరంతర దాడులు చేస్తుందని అలా చేస్తే ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవలసి వస్తుందని రియాద్ హెచ్చరించింది.

Advertisment
తాజా కథనాలు