Goutam Adani: గౌతమ్ అదానీకి అరెస్ట్ వారెంట్.. అతని అల్లునిపై కూడా..

గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూలో న్యూయర్క్‌లో అరెస్టు వారెంట్ జారీ అయింది. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్లు లంచాలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.

Adani Group companies (1)
New Update

ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూలో న్యూయర్క్‌లో అరెస్టు వారెంట్ జారీ అయింది. దీనిలో భాగంగానే గౌతమ్‌ అదానీతో పాటు ఆయన మేనళ్లుడు సాగర్‌ సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

Also Read: 10,12 పరీక్షల తేదీని ప్రకటించిన సీబీఎస్‌ఈ బోర్డు

$265 మిలియన్ల లంచాలు

ఈ మేరకు వీరు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల భారతదేశపు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించినట్లు తెలుస్తోంది. సుమారు $265 మిలియన్ల లంచాలు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీననంతరం అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి.. నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

Also Read: ఫుడ్‌ ప్యాకింగ్‌కు అల్యూమినియం ఎలా ఉపయోగించాలి?

అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్, మాజీ CEO వినీత్ జైన్ తమ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్‌ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని అధికారులు అభియోగాలు మోపారు. అదే సమయంలో సాగర్ అదానీ తన సెల్‌ఫోన్‌ను లంచాల వివరాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించారని వారు ఆరోపించారు.

Also Read: ఇవి తింటే బరువు తగ్గడం కన్ఫామ్‌

గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, జైన్‌లపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ మరో సివిల్‌ కేసు నమోదు చేసింది. యూఎస్‌ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి.. అదానీ గ్రీన్‌ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్‌ డాలర్లకు పైగా సమీకరించిందని ఆరోపించింది. ఇతర ఐదుగురు నిందితులపై విదేశీ అవినీతి పద్ధతుల చట్టం కింద U.S. లంచాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేందుకు కుట్ర పన్నారని, నలుగురిపై న్యాయాన్ని అడ్డుకునేందుకు కుట్ర పన్నారని అభియోగాలు మోపారు. నిందితులు ఎవరూ కస్టడీలో లేరని బ్రూక్లిన్‌లోని యుఎస్ అటార్నీ బ్రయోన్ పీస్ ప్రతినిధి తెలిపారు.

కాగా తన కంపెనీ నుంచి సోలార్ పవర్‌ను కొనుగోలు చేయమని.. రాష్ట్ర ప్రభుత్వాలను బలవంతం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే ఒప్పందంపై సంతకం చేయడానికి 2021లో అప్పటి ఏపీ ప్రభుత్వ అధికారులకు.. రూ. 1,750 కోట్లును అదానీ కంపెనీ లంచంగా ఇచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి. 

Also Read: చెల్లి ఫొటోతో ఎఫ్‌బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్

అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. అదానీకీ అరెస్ట్ వారెంట్ జారీపై అదానీ గ్రూప్ సంస్థ నుంచి స్పందనలేదు. అదే సమయంలో వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు.

#newyork #gautam-adani #solar-project #adani-shares
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe