A R Rahman Concert:
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ముందు నుంచే దూకుడుగా ఉంది. మొదటి నుంచి ఈ పార్టీ తరుఫు అభ్యర్ధి ట్రంప్ అని డిసైడ్ అయిపోవడంతో...ఆయన విపరీతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ రిపబ్లికన్ పార్టీలో అలా కాదు. ముందు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెనే మళ్ళీ నిలుచుంటారని ప్రకటించారు. కానీ మధ్యలో ఆయన అనారోగ్యకారణాల వల్ల...ఆ ప్లేస్‌లోకి కమలా హారిస్ వచ్చారు. ఎన్నికలు ఇంకో మూడు నెలల్లో అనగా ఆ పార్టీలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో కమలా హారిస్‌కు ప్రచారానికి చాలా తక్కువ టైమ్ దొరికింది. అయితే కమలా ఏ మాత్రం తగ్గకుండా సుడిగాలి ప్రచారాలు చేస్తూ మద్దతు కూడగ్టుకుంటున్నారు. ఇప్పటికే చాలాచోట్ల తిరిగేసారు. మరో నెల రోజులు కూడా ఇదే పనిలో ఉండున్నారు ఆమె.
ఎన్నికల ముందు వరకూ కమలా హారిస్ షెడ్యూల్‌ను ఫిక్స్ చేశారు డెమోక్రటిక్ పార్టీ వారు. ఎంత వీలయితే అంత ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కమలా కు మద్దతుగా ఏర్పాటు చేస్తున్న ఓ సభలో ఏ ఆర్ రహమాన్ కాన్సర్ట్ ఉంటుందని తెలిపారు ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐ లాండర్స్’(AAPI) నిధుల సేకరణ బృందం. అయితే ఇది ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అన్న వివరాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీనిపై ఏ ఆర్ రహమాన్ కూడా ఇంకా ఏ ప్రకటనా చేయలేదు.
యూఎస్ ఎన్నికల్లో భారతీయుల ఓట్ బ్యాంక్ కూడా చాలా ముఖ్యమే. ఇక్కడ సిటిజన్లుగా మారిపోయినవారు. గ్రీన్ కార్డు హోల్డర్లు అందరికీ ఓటు హక్కు ఉంటుంది. వీళ్ళ ఓట్లు కూడా అధ్యక్ష ఎంపికలో కీలకపాత్ర పోషిస్తాయి. దీని ప్రకారం అభ్యర్థులకు భారతీయుల మద్దతు కూడగట్టుకోవడం కూడా చాలా అవసరం. అందులో భాగంగానే కమలా హారిస్ ప్రచార సభలో ఏ ఆర్ రహమాన్ కన్సర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏ ఆర్ రహమాన్ అంటే ఇండియన్స్ కు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో పాటూ ఆయన గ్లోబ్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడి అమెరికన్లు కూడా రహమాన్ సంగీతాన్ని ఎంజాయ్ చేస్తారు.
Also Read: లెబనాన్ సరిహద్దుల్లో 900 మంది భారతీయులు..ఆందోళనలో ప్రభుత్వం