బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి మృతి.. 2వారాల్లో నాల్గవ హత్య

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. షరియత్‌పూర్ జిల్లాలో ఖోకన్ చంద్ర దాస్ (50) అనే హిందూ వ్యాపారిపై దుండగులు అమానవీయంగా దాడి చేసి, సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.

New Update
bangladesh

bangladesh

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. షరియత్‌పూర్ జిల్లాలో ఖోకన్ చంద్ర దాస్ (50) అనే హిందూ వ్యాపారిపై దుండగులు అమానవీయంగా దాడి చేసి, సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచారు. మెడికల్ షాపు, మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించే ఖోకన్ దాస్, డిసెంబర్ 31 రాత్రి తన పని ముగించుకుని ఆటో రిక్షాలో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో తిలోయి ప్రాంతానికి చేరుకోగానే, కొందరు దుండగులు ఆటోను అడ్డుకున్నారు. ఖోకన్‌ను బయటకు లాగి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. అంతటితో ఆగకుండా, చనిపోయాడని నిర్ధారించుకోవడానికి ఆయన శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

మంటల సెగతో విలవిలలాడిన ఖోకన్, ప్రాణాలను కాపాడుకోవడానికి పక్కనే ఉన్న చెరువులోకి దూకారు. ఆయన అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకోగా, దుండగులు పరారయ్యారు. వెంటనే ఆయనను షరియత్‌పూర్ సదర్ ఆసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో ఢాకాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మృతి: ఖోకన్ శరీరంపై తీవ్రమైన కత్తిపోట్లతో పాటు ముఖం, తల, చేతులు తీవ్రంగా కాలిపోయాయని వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన, గాయాల తీవ్రత తట్టుకోలేక జనవరి 2న తుదిశ్వాస విడిచారు. తనపై దాడి చేసిన వారిలో 'రబ్బీ', 'సోహగ్' అనే వ్యక్తులను ఖోకన్ గుర్తించినట్లు ఆయన భార్య సీమా దాస్ పేర్కొన్నారు. గత రెండు వారాల్లో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన నాలుగో దాడి ఇది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, మైనారిటీలకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు