Delta Force: శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే అమెరికా 'ఘోస్ట్' ఆర్మీ!

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఆర్మీలో అమెరికా 'డెల్టా ఫోర్స్' ఒకటి. శనివారం వెనిజులాలో జరిగిన మెరుపు దాడిలో నికోలస్ మదురోను పట్టుకోవడంలో ఈ డెల్టా ఫోర్స్ కీలకమని వార్తలు రావడంతో, అసలు ఈ డెల్టా ఫోర్స్ ఏంటి? వీరు ఎంత శక్తివంతులనే చర్చ మొదలైంది.

New Update
Delta Force

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఆర్మీలో అమెరికాకు చెందిన 'డెల్టా ఫోర్స్' ఒకటి. శనివారం వెనిజులాలో జరిగిన మెరుపు దాడిలో అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడంలో ఈ డెల్టా ఫోర్స్ కీలక పాత్ర పోషించిందని వార్తలు రావడంతో, అసలు ఈ డెల్టా ఫోర్స్ ఏంటి? వీరు ఎంత శక్తివంతులు? అనే చర్చ మొదలైంది.

అధికారికంగా దీనిని 1st Special Forces Operational Detachment-Delta అని పిలుస్తారు. 1977లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఫోర్స్ ఉందని అమెరికా ప్రభుత్వం చాలా ఏళ్ల వరకు అధికారికంగా అంగీకరించలేదు. వీరు నేరుగా అమెరికా అధ్యక్షుడి ఆదేశాలతో లేదా డిఫెన్స్ సెక్రటరీ పర్యవేక్షణలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లను నిర్వహిస్తారు. అమెరికా సైన్యంలోని అత్యుత్తమ సైనికులను మాత్రమే డెల్టా ఫోర్స్ కోసం ఎంపిక చేస్తారు. వీరి ఎంపిక ప్రక్రియలో 90 శాతం మంది ఫెయిల్ అవుతుంటారు. మానసిక దృఢత్వం, శారీరక శక్తి కలిగిన వారినే తీసుకుంటారు.

డెల్టా ఫోర్స్ సభ్యులు సాధారణ సైనికుల్లా యూనిఫామ్ ధరించరు. గడ్డాలు పెంచి, సామాన్య ప్రజల మధ్యలో కలిసిపోయి ఉంటారు. వీరి పేర్లు, వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతారు. వీరు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అధునాతనమైన యుద్ధ పరికరాలు, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వాడుతారు. వీరికి ప్రత్యేకంగా రూపొందించిన హెలికాప్టర్లు, డ్రోన్లు ఉంటాయి. డెల్టా ఫోర్స్ గతంలో అనేక క్లిష్టమైన మిషన్లను విజయవంతం చేసింది. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ని అండర్ గ్రౌండ్ నుండి వెలికితీసింది వీరే. ISIS చీఫ్ బగ్దాదీని సిరియాలో మట్టుబెట్టిన ఆపరేషన్‌లో వీరు కీలక పాత్ర పోషించారు. గతంలో పనామా నియంత మాన్యుయెల్ నోరిగాను పట్టుకోవడంలో కూడా వీరు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మదురో అరెస్ట్ కూడా అదే తరహాలో జరిగిందని భావిస్తున్నారు.

మదురో ఆపరేషన్‌లో వీరి పాత్ర:
డెల్టా ఫోర్స్ కరాకస్‌లోని మదురో నివాసాన్ని అత్యంత వేగంగా చుట్టుముట్టారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే గగనతలం నుండి కిందకు దిగి, భద్రతా వలయాన్ని ఛేదించి మదురోను అదుపులోకి తీసుకున్నారు. టెక్నాలజీ, మెరుపు వేగం వీరి మెయిన్ స్ట్రెంథ్. మొత్తానికి, అమెరికా తన శత్రువులను ఏ మూల ఉన్నా పట్టుకోవడానికి వాడే అత్యంత పదునైన ఆయుధం ఈ 'డెల్టా ఫోర్స్'.

Advertisment
తాజా కథనాలు