Trump Dance : ట్రంప్ మాస్ డ్యాన్స్.. నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియోలు

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. కమలా హారిస్ పై భారీ మెజారిటీతో గెలిపొందారు. దీంతో ట్రంప్‌కు సంబంధించిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

New Update
trump dance videos

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ ఉండేది. డొనాల్డ్ ట్రంప్ - కమలా హారిస్ మధ్య పోటా పోటీ నడిచింది. కానీ అందరూ ఊహించినట్లుగానే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఘన విజయం సాధించింది. 

ట్రంప్ డాన్స్ వీడియోలు

దీంతో ట్రంప్‌కు సంబంధించిన డాన్స్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా మంది సోషల్ మీడియా వేదికగా ట్రంప్ డాన్స్‌ వీడియోలు షేర్ చేస్తున్నారు. మరికొందరైతే రకరకాలు డాన్స్ వీడియోలు ఎడిట్ చేసి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. 

Also Read : అమెరికా ఎన్నికల్లో 'జై బాలయ్య'.. వైరల్ అవుతున్న బ్యాలెట్ పేపర్

కాగా 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అమెరికాలో.. గెలుపు కోసం 270 ఓట్లు అవసరం కాగా.. రిపబ్లికన్ పార్టీ మెజార్టీ మార్క్‌ లీడ్‌ను దాటడంతో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షులు అవుతున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు. 277 ఎలక్టోరల్ ఓట్లతో మేజిక్‌ ఫిగర్‌ క్రాస్‌ చేసిన ట్రంప్‌.. 67,204,711 పాపులర్‌ ఓట్లు సాధించారు. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు