USA Elections:
అమెరికా అధ్యక్ష ఎన్నికలు...ప్రపంచమంతా ఆసక్తిగా చూసే ఎన్నికల్లో ఇవి ఒకటి. ఇక్కడ కేవలం రెండు పార్టీ మధ్యనే పోటీ ఉంటుంది. ఒకటి రిపబ్లికన్, రెండు డెమోక్రటిక్. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్స్ తరుఫు నుంచి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్స్ తరుఫు నుంచి కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్యా పోటీ ఇప్పుడు ఆసక్తి కరంగా ఉంది. ముఖ్యంగా యూఎస్‌కి కాబోయే అధ్యక్షుడు ఎవరనేది తెలియజేసే స్వింగ్ స్టేట్స్‌లో కూడా ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంది.
ఎన్నికల ప్రచారంలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులూ దూసుకుపోతున్నారు. సర్వేల్లో ఇద్దరికి వచ్చే ఓట్లలో పెద్దగా తేడా ఉండటం లేదు. దాంతో ఈ అధ్యక్ష ఎన్నిక పీఠంపై కూర్చునేదెవరో అంచనావేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అరిజోనా, మిషిగన్, జార్జియాలో కమల హారిస్ ముందంజలో ఉండగా.. నెవెడా, పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యం ప్రదర్శించారు. నార్త్ కరొలైనా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇక స్వింగ్ స్టేట్ విషయానికి వస్తే...అరిజోనా, నెవెడా,విస్కాన్సిన్, మిచిగాన్, జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియాలను స్వింగ్ టేట్స్ అంటారు. ఇక్కడ ఓటర్ల నిర్ణయం బట్టి అధ్యక్షుడు ఎవరన్నది తేలుతుంది. ముఖ్యంగా పెన్సిల్వేనియాలో. ఈసారి ఎన్నికల్లో
పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినాలోని రిపబ్లికన్లకు మద్దతు కొంచెం ఎక్కువగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఈ మూడు రాష్ట్రాల్లో 49 శాతంతో ముందు ఉండగా, కమలా హారిస్ 48 శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఇక నెవడాలో మాత్రం హారిస్ గెలిచే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ట్రంప్‌కి 47 శాతం ఉండగా, కమలా హారిస్‌కి 48 శాతం మద్దతు ఉంది. మిచిగాన్, విస్కాన్సిన్ లలో ఇద్దరిక 49 శాతం మద్దతు ఉంది. ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ సర్వే ప్రకారం.. హారిస్‌కి ఆసియన్లు, యూత్‌లో ప్రజాదరణ ఉండగా, మిగతా వర్గాలు ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే వాల్ స్ట్రీట్ జర్నల్ పోల్ ప్రకారం.. ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ఆరింటిలో ఇద్దరు రెండు శాతం పాయింట్ల తేడాలో ఉన్నట్లు చెప్పింది. అరిజోనా, జార్జియా, మిచిగాన్ రాష్ట్రాల్లో కమలా హారిస్ ఆధిక్యంలో ఉండగా.. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవెడాలో ట్రంప్ ముందున్నారు.
యుద్ధం ఫలితాలను నిర్ణయించనుందా?
ప్రస్తుతం ఇజ్రాయెల్, హెజ్బుల్లా, ఇరాన్ ల మధ్య యుద్ధం జరుగుతోంది. దీంట్లో అమెరికా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించనుందని సర్వేలు చెబుతున్నాయి. యుద్ధాలను డీల్ చేయడంలో కమలా హారిస్ కంటే ట్రంప్‌కు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. యుద్ధాల సమయంలో దేశాన్ని ట్రంప్ బాగా నడిపించగలరని చాలా మంది అమెరికన్లు నమ్ముతున్నారు. దాంతో పాటూ ఆర్ధిక వ్యవస్థ, వలసదారుల సమస్యలు లాంటి విషయాల్లో కూడా ట్రంప్ కే ఎక్కువ మద్దతు లభిస్తోంది. అయితే ఆరోగ్య సంరక్షణ విషయంలో మాత్రం అమెరికన్లు కమలా హారిస్ వైపే ఉన్నారు. మరోవైపు ఇండియన్లు కూడా కమలాకు ఎక్కువ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఆమె ఇండియన్ మూలాలు కలిగి ఉండడమే ఇందుకు కారణం.