Tigers In Vietnam:
దక్షిణ వియత్నాంలో బర్డ్‌ఫ్లూ వైరస్..హెచ్5ఎన్1 విపరీతంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారిన పడి జంతువులు పదుల్లో మరణిస్తున్నాయి. వియత్నాంలోని పలు జూలు, సఫారీల్లో 47 పులులు, మూడు సింహాలు, ఒక పాంథర్ మృతిచెందినట్లు అక్కడి అధికారిక మీడియా ప్రకటించింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. లాంగ్ యాన్ ప్రావిన్స్‌లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్, హోచి మిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వూన్ జోయ్ జూలో జంతువులు మృత్యువాతన పడ్డాయి. వరుసగా ఒకదాని తరువాత ఒకటి చనిపోతుండడంతో అనుమానం వచ్చి వీటి శాంపిల్స్‌ను నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్‌కు పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో హెచ్5ఎన్1 టైప్ ఎ రకం కారణంగానే జంతువులు మరణించినట్లు తేలింది. అయితే ఈ జంతు మరణాల కారణంగా జూలోని వర్కర్లు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులూ కలుగలేదు.
ఇంతకు ముందు కూడా వియత్నాంలో బర్డ్‌ఫ్లూ ఆరణగా డజన్ల కొద్దీ పులులు చనిపోయాయి. 2004లో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రీడింగ్ ఫార్మ్‌లో పులుల అప్పుడు చనిపోయాయి. వియత్నాంలో 2023 చివరి నాటికి మొత్తం 385 పులులు ఉన్నట్లు ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం, వన్యప్రాణుల సంరక్షణపై పనిచేసే ఒక ఎన్జీవో తెలిపాయి. 310కి పైగా పులులు ప్రైవేటు ఫారమ్‌లు, జూలలో ఉండగా.. మిగతావి ప్రభుత్వానికి సంబంధించిన కేంద్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Israel: వీరుడ్ని కోల్పయాం..ఇజ్రాయెల్ సైన్యంలో మొదటి మరణం