అమెరికాని పగబట్టిన ప్రకృతి.. మంచుతుపానులో 30 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టింది. గత రెండు రోజులుగా అమెరికా తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న భారీ మంచు తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మంగళవారం ఉదయం నాటికి వివిధ రాష్ట్రాల్లో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
US snow (1)

అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టింది. గత రెండు రోజులుగా అమెరికా తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న భారీ మంచు తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మంగళవారం ఉదయం నాటికి వివిధ రాష్ట్రాల్లో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్ శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ తుఫాను కారణంగా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క టేనస్సీ రాష్ట్రంలోనే 2.3 లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారు. మంచు విద్యుత్ లైన్లపై మంచు పేరుకుపోయి స్తంభాలు విరిగిపడ్డాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నాటికి 7 లక్షల మందికి పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెక్సాస్ నుండి న్యూ ఇంగ్లాండ్ వరకు దాదాపు 2,100 కిలోమీటర్ల మేర ఈ తుఫాను విస్తరించి ఉంది. సుమారు 20 కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన చలి హెచ్చరికల కింద ఉన్నారు. 30కి పైగ రాష్ట్రాల్లో మంచు తుపాను కారణంగా అడుగు మేరా మంచు పేరుకుపోయింది.

రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిన్న ఒక్కరోజే 12,000 విమాన సర్వీసులు రద్దు కాగా, నేడు మరో 4,000 విమానాలను రద్దు చేశారు. దీనితో ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  న్యూయార్క్ సిటీలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా బయట తిరుగుతున్న ఐదుగురు మరణించగా, టేనస్సీ, లూసియానా, పెన్సిల్వేనియా, అర్కాన్సాస్, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో చలితీవ్రతకు, రహదారి ప్రమాదాలకు పలువురు బలయ్యారు. మసాచుసెట్స్, ఒహియోలో మంచు తొలగించే వాహనాలు ఢీకొని మరికొందరు మృతి చెందారు.

Advertisment
తాజా కథనాలు