Nigeria: నైజర్ నదిలో పడవ బోల్తా..100 మంది మృతి

నైజీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నైజర్  నదిలో పడవ బోల్తా డింది. దీనిలో వంద మందికి పైగా గల్లంతయ్యారు వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

New Update
11

 ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. కోగి రాష్ట్రం నుంచి పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.  ఇందులో గల్లంతైనట్లు నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధి ఇబ్రహీం తెలిపారు. పడవలో పట్టే చోటు లేకపోయినా ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. లైఫ్ జాకెట్లు, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. 

ఈరోజు  తెల్లవారుజామున కోగి రాష్ట్రం నుంచి నైజర్‌లో ఫుడ్‌ మార్కెట్‌కు వెళ్తుండగా ఈ పడవ ప్రమాదానికి గురైంది. గల్లంతైన వారిలో ఏడుగురు మృతి చెందారు. మిగతా వారిని రక్షించేందుకు స్థానిక డైవర్లు రంగంలోకి దిగారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Also Read: Gold and Silver: మళ్ళీ పరుగులు తీస్తున్న బంగారం, వెండి ధరలు...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు