Women's Day : మహిళలకు ఈ చట్టపరమైన హక్కులు ఉన్నాయి.. ప్రతి మహిళా తెలుసుకోవాలి!

చాలా రంగాల్లో మహిళలపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. రేపే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మహిళలు సమాజంలో గౌరవంగా, సమానత్వ భావనతో జీవించేందుకు వారికి కల్పించిన చట్టపరమైన హక్కుల గురించి తెలుసుకుందాము. పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

Women's Day : మహిళలకు ఈ చట్టపరమైన హక్కులు ఉన్నాయి.. ప్రతి మహిళా తెలుసుకోవాలి!
New Update

Women's Day Special :  ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Women's Day) జరుపుకుంటారు. మహిళలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వాన్ని హైలైట్ చేయడానికి ఈ దినోత్సవాన్ని అంకితం చేశారు. 1908లో అమెరికా(America) లో కార్మికోద్యమం జరిగిన తర్వాత.. ఈ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమంలో సుమారు 15 వేల మంది మహిళలు న్యూయార్క్(New York) వీధుల్లోకి వచ్చి తమ హక్కులను డిమాండ్ చేశారు. తమ పనివేళలను తగ్గించాలని, పే స్కేల్ పెంచాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ ఉద్యమంలో మహిళలకు ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్ కూడా వచ్చింది. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు సమాజంలో గౌరవంగా, సమాన భావనతో జీవించేందుకు వీలుగా వారికి కల్పించిన చట్టపరమైన హక్కుల గురించి తెలుసుకోండి.

భారత్‌లో మహిళలకు చట్టపరమైన హక్కులు:

సమానత్వ హక్కు

భారత రాజ్యాంగం(Indian Constitution) సమానత్వానికి పెద్దపీఠ వేసింది. ఆర్టికల్ 14(1) పౌరులందరికీ సమానత్వ హక్కులను కల్పించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(1) ప్రకారం భారత పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో సమానత్వం లభిస్తుంది. మతం, కులం, పుట్టిన ప్రదేశం, జెండర్ లేదా మరేదైనా ప్రాతిపదికపై వివక్ష లేకుండా ప్రతి వ్యక్తికి ఈ హక్కు ఉంది.

సెక్షన్ 15(3)

ఈ సెక్షన్ కింద వివిధ వర్గాల మహిళలు సమాజంలో సమానత్వంతో జీవించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక ఎన్ ఫోర్స్ మెంట్ల ద్వారా మద్దతును అందించవచ్చు.

సమాన వేతనం

స్త్రీ పురుషులకు సమాన వేతనం పొందే హక్కు ఉన్నప్పటికీ.. పురుషులు, మహిళల వేతనంలో వ్యత్యాసం ఉంది. అనేక రంగాల్లో ఇప్పటికీ పురుషుల కంటే మహిళలకు తక్కువ వేతనాలు లభిస్తున్నాయి. మహిళలకు సమాన వేతనం పొందే హక్కును రాజ్యాంగం కల్పించింది. సమాన వేతన చట్టం ప్రకారం లింగ ప్రాతిపదికన వేతనాలు, వేతనాల్లో వివక్ష చూపడానికి వీల్లేదు.

గోప్యత

మహిళల(Women's) పై జరుగుతున్న నేరాల పై కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది రాజ్యాంగం. లైంగిక దాడి కేసులో, బాధితురాలు తన పేరు, గుర్తింపును గోప్యంగా ఉంచే హక్కును కలిగి ఉంటుంది. దీంతో పాటు మహిళా పోలీసు అధికారి సమక్షంలో ఆమె.. తన ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. ఆ మహిళ పేరును, వివరాలను  వెల్లడించే హక్కు పోలీసులకు, మీడియాకు, అధికారులకు ఉండదు.

మెటర్నిటీ బెనిఫిట్ హక్కులు

పనిచేసే మహిళలకు ప్రసూతి ప్రయోజనాలు, సౌకర్యాల హక్కును చట్టం ఇస్తుంది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం, మహిళలు డెలివరీ తర్వాత 6 నెలల సెలవు తీసుకోవచ్చు. ఈ కాలంలో వారి జీతంలో ఎలాంటి కోత ఉండదు. డెలివరీ తర్వాత 6 నెలల ప్రసూతి సెలవులు పూర్తయిన తర్వాత, మహిళ తిరిగి పనికి రావచ్చు.

Also Read : Balakrishna: గాలికి విగ్‌ ఊడింది.. కోపంతో ఊగిపోయిన బాలయ్య ఏం చేశాడంటే?

#womens-right #womens-day-special #international-womens-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe