Women's Day : 16 ఏళ్ల టీనేజ్‌ పిల్ల.. రూ.100 కోట్ల కంపెనీ.. ఈ కథ వింటే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేరు!

చాట్‌బాట్ టెక్నాలజీకి అత్యంత ఆకర్షణీయమైన ఉదాహరణలలో డెల్వ్ ఒకటి. ప్రాంజలి అవస్థి అనే 16 ఏళ్ల భారతీయ సంతతి అమ్మాయి స్థాపించిన స్టార్టప్ ఇది. రూ.100 కోట్ల విలువైన కంపెనీ. విమెన్స్ డే సందర్భంగా ఈ టీనేజర్ సక్సెస్‌ స్టోరీ గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Women's Day : 16 ఏళ్ల టీనేజ్‌ పిల్ల.. రూ.100 కోట్ల కంపెనీ.. ఈ కథ వింటే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేరు!

Who Is Pranjali Awasthi : ప్రతిభకు వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లలైనా, వృద్ధులైనా తమ టాలెంట్‌ని, స్కిల్‌ను చూపించేందుకు వయసు అడ్డంకిగా మారదు. అయితే ధైర్యం ఉండాలి. సాహసం చేసి నిర్ణయం తీసుకోవాలి. నలుగురితో కలిసి కాదు.. నలుగురిలో ఒకరిగా అడుగులు వేయాలి. అప్పుడే కెరీర్‌ సక్సెస్(Successful Career) అవుతుంది. మొదటి మెట్టులో ఓడినా.. 10 మెట్టు వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అలా ప్రయత్నించి సఫలమైనవారు ఎందరో ఉన్నారు. ఇక ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా టీనేజ్‌లో సక్సెస్‌ అయిన ఒక అమ్మాయి గురించి తెలుసుకుందాం!

ప్రాంజలి కథ ఇదే:
గెలవలాన్న కసి ఉండాలే కానీ అవకాశాలు అపరిమితంగా ఉన్నాయని నిరూపించిన కొద్దిమందిలో ప్రాంజలి అవస్థి(Pranjali Awasthi) ఒకరు. ఆమె కేవలం 16 సంవత్సరాల వయస్సులో తన స్టార్టప్‌ను ప్రారంభించింది. నేడు ఆమె కంపెనీ విలువ రూ. 100 కోట్లు. ప్రాంజలి అవస్తి AI స్టార్టప్ డెల్వ్‌తో ప్రపంచం ముందుకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో అద్భుతాలు చేయవచ్చని భావించిన ప్రాంజలి ఈ అవకాశాన్ని రెండు చేతులతో పట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ వనరులు, నిర్దిష్ట సమాచారాన్ని త్వరగా కనుగొనడంలో ఉపాధ్యాయులు, వ్యక్తులకు సహాయం చేయడం Delv.AI లక్ష్యం. ప్రాంజలి సంస్థ Delv.AI వ్యాపారం కోసం 3.7 కోట్ల రూపాయల నిధులను పొందింది. ప్రస్తుతం కంపెనీ మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లు.

టీనేజ్‌ వండర్‌:
16 ఏళ్ల వయసులో ప్రాంజలి తన కంపెనీలో 10 మందిని నియమించుకుంది. ఆమె బృందానికి నాయకత్వం వహించింది. కోడింగ్ నుంచి కార్యకలాపాలు, కస్టమర్ సర్వీస్‌ వరకు Delv.AIలో మల్టి టాస్కింగ్‌(Multi Tasking) చేస్తోంది. 16 ఏళ్ల వయసులో రూ.100 కోట్ల విలువైన కంపెనీని స్థాపించడం జోక్ కాదు. ప్రాంజలికి చిన్నప్పటి నుంచి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. ప్రాంజలి 7 సంవత్సరాల వయస్సులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రారంభించింది. కేవలం 13 సంవత్సరాల వయస్సులో ప్రాంజలి అవస్తి ఇంటర్న్‌షిప్ కోసం ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ(Florida International University) కి వెళ్లింది. అక్కడ ప్రాంజలి మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లలో పనిచేసింది. ఈ సమయంలోనే AI ద్వారా సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకుంది. ఫ్లోరిడాలో ఆమె అనుభవం Delv.AIకి పునాదికి ఆమెను ప్రేరేపించాయి.

Also Read : మహాశివరాత్రి రోజు అదిరిపోయే అప్డేట్‌ తో రాబోతున్న కన్నప్ప టీం!

Advertisment
తాజా కథనాలు