International Moon Day 2024 : చంద్రుడిపై మనిషి కాలుమోపి ఐదు దశాబ్దాలకు పైగానే కాలం గడచిపోయింది. చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపిన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (Neil Armstrong) ఎంతో ఉద్విగ్నంగా చేసిన కామెంట్స్‌ను ఇప్పటికీ సైంటిస్టులు గుర్తు చేసుకుంటారు. 'చంద్రునిపై (Moon) మనిషి వేసిన తొలి అడుగు మానవాళికి ముందడుగు' అంటూ ఆనాడు ఎంతో ఎమోషనల్ అయ్యారు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. చంద్రుడిపై మనిషి కాలుమోపిన సందర్భానికి గుర్తుగా ఏటా జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
ప్రయత్నాలు ఆపేసిన నాసా:
- 1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్‌క్విలిటీ బేస్‌పైన దిగింది. భారత కాలమానం ప్రకారం జూలై 21 ఉదయం 9 గంటల 26 నిమిషాలకు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టి, మానవ చరిత్రలో చంద్రుడిపై నడిచిన మొదటి మనిషిగా నిలిచిపోయారు. ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎడ్విన్ బజ్, అల్డ్రిన్‌లు అనుసరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాసాకు చెందిన మరో ఐదుగురు మూన్‌పైకి వెళ్లి వచ్చారు. ఇక 1972 తర్వాత మనుషులను పంపే మిషన్‌ను అమెరికా (America) మరోసారి చేపట్టలేదు. అప్పటి నుంచి నేటి వరకు ఏ ఒక్క దేశం మనుషులను పంపలేదు.
రష్యా వర్సెస్ సోవియట్:
- చంద్రుణ్ణి అందుకోవాలనే తపన మనుషుల్లో చాన్నాళ్లుగానే ఉంది. అటు అమెరికా ఇటు సోవియట్ రష్యా (Russia) చంద్రుడిపైకి చేరుకునేందుకు పోటిపడ్డాయి. ఇక తొలిసారిగా సోవియట్ రష్యా చంద్రుడి మీదకు 1959 జనవరి 2న ప్రయోగించిన 'లూనా–1' ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది. అటు 'నాసా' 1969 జూలై 16న 'అపోలో–11' ప్రయోగాన్ని చేపట్టగా.. ఇది కూడా సక్సెస్ అయ్యింది. చంద్రుడి మీదకు మనుషులతో చేరుకున్న తొలి వ్యోమనౌకగా నాసా చరిత్ర సృష్టించింది.
చంద్రయాన్-3తో సక్సెస్:
- చంద్రుడిపైకి చేరుకునే ప్రయోగాలను అమెరికా, రష్యాలు పోటాపోటీగా గడచిన శతాబ్దిలోనే చేపడితే, భారత్ ఈ ప్రయోగాలను కాస్త లేట్‌గా మొదలుపెట్టిందనే చెప్పాలి. 2008 అక్టోబర్ 22న 'చంద్రయాన్–1' (Chandrayan-1) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఈ వ్యోమనౌక చంద్రుని ఉపరితలంపై నీటి జాడను గుర్తించింది. అటు 2019 జూలై 22న చంద్రయాన్–2 వ్యోమనౌకను చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి చేరుకోలేదు. మధ్యలోనే గల్లంతైంది. ఇక 2023లో ఆగస్టు 23న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టిన ఇండియా ఇందులో సూపర్ సక్సెస్ సాధించింది.
మరోసారి కూడా అమెరికన్లేనా?
- అటు 2025లో మరోసారి నాసా చంద్రుడిపై కాలు మోపేందుకు సిద్ధమైంది. నిజానికి 'ఆర్టెమిస్-2' ప్రయోగంలో వ్యోమగాములను స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి పంపిస్తారు. కానీ వారు చంద్రుడి మీద దిగరు. వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎంతవరకూ సహకరిస్తుందన్నదాని పరిశీలిస్తారు. ఇక ఆ తర్వాత 2025లో 'ఆర్టెమిస్-3' ప్రయోగం ద్వారా వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపాలని నాసా భావిస్తోంది.
ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌లో ఘోరం.. కారులో 9వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్