Polavaram Project: పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం రెండో రోజు పర్యటిస్తోంది. ప్రాజెక్ట్‌ను నలుగురు నిపుణులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఉదయం ప్రాజెక్టులోని గెస్ట్ హౌజ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ తో భేటీ అయిన బృందం పలు కీలక విషయాలపై అధికారులతో చర్చించారు.
Also Read: చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీలు కాదు.. ఇది మనకు ముఖ్యం: షర్మిల
నిన్న స్పిల్ వే నిర్మాణం, మ్యాప్ పై అధ్యయనం చేసిన నిపుణులు ఎగువ కాపర్ డ్యామ్ (Copper Dam) శాంపిల్స్ ను సేకరించి.. డ్యామ్ మ్యాప్ ను పరిశీలించారు. ఈ రోజు పూర్తిగా డయా ఫ్రమ్ వాల్ పై ఫోకస్ పెట్టారు. మరో రెండురోజుల పాటు పోలవరంలోనే జలవనరుల బృందం పర్యటించనుంది. ఇంజనీర్, పీపీఏ అధికారులు, ప్రాజెక్టు ఏజెన్సీలతో అధికారుల బృందం చర్చించనుంది.