YCP: పెనుగొండ వైసీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు..!

శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. తుంగోడు గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణకు అవమానం జరిగింది. శిలాఫలకంపై శంకర్ నారాయణ ఫోటోపై సీఎం జగన్ స్టిక్కర్ అతికించారు.

New Update
YCP: పెనుగొండ వైసీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు..!

Anathapuram: శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజవర్గంలో ఎమ్మెల్యే శంకర్ నాయణకు సీఎం సర్వేలో సరిగా మార్కులు రాలేదని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీని పెనుకొండ నియోజకవర్గం సమన్వయ కర్తగా ప్రకటించారు. ముఖ్యంగా పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణపై నాలుగు సంవత్సరాల నుండి వ్యతిరేకవర్గం బలంగా పనిచేసినట్లు తెలుస్తోంది. వారి డిమాండ్ మేరకే ఉషశ్రీ ని కళ్యాణ దుర్గం నుంచి పెనుకొండకు బదిలీ చేశారని టాక్ వినిపిస్తుంది. ఉషశ్రీ వచ్చినప్పటినుండి నియోజవర్గంలో తిరుగుతున్నా.. వర్గ విభేదాలను తాను ప్రోత్సహించను అని చెప్తున్నా.. చాప కింద నీరులా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి.

Also Read: సమర్థవంతం అంటే పార్టీలు‌ మారడమా?.. కేశినేని‌ నానిపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఫైర్

సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ చేతుల మీదుగా ప్రారంభం కావలసి ఉంది. కానీ, కార్యక్రమానికి శంకర్ నారాయణ వస్తే తాను రాలేనని చెప్పడంతో విధి లేని పరిస్థితుల్లో సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి ఉషశ్రీ చే ప్రారంభించారు. శంకర్ నారాయణచే ఈ భవనాలను ప్రారంభించాలనుకున్న నాయకులు, అధికారులు ఆయన ఫోటోతోపాటు పేరును శిలాఫలకంపై చెక్కించారు.

Also Read: ఎంపీ బాలశౌరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా.!

దీంతో, మంత్రి ఉషశ్రీ.. శంకర్ నారాయణ ఫోటోను తీసేయాలని ఆదేశాలు జారీ చేయడంతో శంకర్ నారాయణ ఫోటోపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ ను అతికించి కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. ఈ విషయం తెలుసుకున్న శంకర్ నారాయణ వర్గీయులు మంత్రి ఉషశ్రీ నిర్ణయాన్ని తప్పుపడుతూ బయటికి చెప్పుకోలేక మదన పడుతున్నట్లు తెలుస్తోంది. వర్గ విభేదాలన్నీ రూపుమాపుతానన్న ఉషశ్రీ ఈ కార్యక్రమం ద్వారా ఇరు వర్గాల మధ్య ఇంకా వైరాన్ని పెంచినట్టు ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు