Union Budget 2024: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం పార్లమెంట్‌లో మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ (BJP) ప్రభుత్వంలో ఇదే చివరి బడ్జెట్. అయితే ఈ బడ్జెట్ మొత్తం రూ.47.77 లక్షల కోట్లు కాగా.. పలు మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ప్రధాని మోదీ (PM Modi) హయాంలోనే 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని నిర్మలా సీతారామన్ అన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మంత్రంతో ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు.
ఏ శాఖలకు ఎంత కేటాయింపు..
1. మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు
2. రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.6.2 లక్షల కోట్లు
3. రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు
4. హోం శాఖకు రూ.2.03 లక్షల కోట్లు
5. వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27లక్షల కోట్లు
6. గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77లక్షల కోట్లు
7. ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2.78 లక్షలకోట్లు
8. ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2.13 లక్షల కోట్లు
9. రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68 లక్షలకోట్లు
10. కమ్యూనికేషన్ రంగానికి రూ.1.37 లక్షలకోట్లు
11. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేలకోట్లు
12. ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ.7500 కోట్లు
13. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200 కోట్లు
14. సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903 కోట్లు
15. సోలార్ విద్యుత్ గ్రిడ్‌కు రూ.8500 కోట్లు
16. గ్రీన్ హైడ్రోజన్‌కు రూ.600 కోట్లు
Also Read: తెలంగాణకు, ఏపీకి బడ్జెట్‌లో కేటాయించినవి ఇవే..
మరిన్ని ప్రోత్సహకాలు
1. సంస్కరణలు అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు రూ.75వేల కోట్ల వడ్డీలేని రుణాలు
2. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్
3. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద రూ.2 కోట్ల ఇళ్ల నిర్మాణం
4. గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానామే ఈఏడాది కొనసాగింపు. రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా రిబేటు
5. 9 -18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు
6. ఆశాలు, అంగన్‌వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు.
7. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత.
8. విమానయాన రంగంలో 2,3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులు
9. రైలు బోగీలన్నింటినీ వందే భారత్ ప్రమాణాలతో మార్పు
10. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత
11. లక్ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంపు
12. భారత్ నుంచి మధ్య ప్రాచ్యం మీదుగా యూరప్‌నకు ప్రత్యేక కారిడార్
13. ఫేస్‌లెస్ విధానంతో పారదర్శకత, సత్వర రిటర్న్‌ల చెల్లింపులు