భాస్కర్‌ రెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి దింవంగత వివేఖానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు భాస్కర్‌ రెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

భాస్కర్‌ రెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరు
New Update

మాజీ మంత్రి దింవంగత వివేఖానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు భాస్కర్‌ రెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. 12 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. భాస్కర్‌ రెడ్డి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. అతన్ని ఎస్కార్ట్‌ వాహనం ఇంటి వద్ద దింపాలని సీబీఐ కోర్టు పోలీస్‌ అధికారులను ఆదేశించింది. కాగా సెంప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్ 3 వరకు వైఎస్‌ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్‌ ఇస్తున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది.

కాగా తన ఆరోగ్యం బాగోలేదని భాస్కర్‌ రెడ్డి గత 15 రోజుల పాటు సీబీఐ కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరుతూ వస్తున్నాడు. తాజాగా భాస్కర్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అతని ఆరోగ్యం కుదుట పడేవరకు బెయిల్‌ ఇస్తున్నట్లు తెలిపింది. భాస్కర్‌ రెడ్డి హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాని ఆవేశించింది. భాస్కర్‌ రెడ్డి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా వైఎస్‌ భాస్కర్ రెడ్డి వివేకా మర్డర్‌ కేసులో A5 నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు చంచల్ గూడా జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు.

మరోవైపు భాస్కర్‌ రెడ్డికి బెయిల్‌ ఇవ్వడాన్ని పలువురు తప్పుబుతున్నారు. మాజీ మంత్రి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి బెయిల్‌ ఎలా ఇస్తారంటున్నారు. న్యాయస్థానం ఆయన్ను పోలీసుల ఆధీనంలో ఉంచి వైద్య పరీక్షలు చేయిస్తే బాగుండేదని, అతని బెయిల్‌పై బయటకు వస్తే సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అంతే కాకుండా అతనికి ఇతరుల నుంచి ప్రాణ పొంచి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#interim-bail #cbi-court #grant #bhaskar-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe