Wayanad: వయనాడ్‌ విలయం.. శిథిలాల కింద శవాలు..

వయనాడ్‌లోని చూరాల్‌మలైలో 1000 మంది అసలు ఎక్కడున్నారో తెలియదని అక్కడున్న రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మొత్తం 3000 మందిలో దాదాపు 1000 మంది మాత్రమే తప్పించుకున్నారన్నారు. శిథిలాల కింద ఉన్న శవాలను వెలికితీస్తున్నామని.. డెడ్‌బాడీలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని అన్నారు.

New Update
Wayanad: వయనాడ్‌ విలయం.. శిథిలాల కింద శవాలు..

Wayanad Disaster: వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతం అతలాకుతలమైంది. దాదాపు ఐదు గ్రామాలు వరద నీటీలో మునిగిపోయాయి. మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు ఏకంగా నామరూపాల్లేకుండా పోయాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో నిద్రలో ఉన్నవారు నిద్రలోనే చనిపోయిన పరిస్థితి. ఇప్పటికే మృతుల సంఖ్య 300 దాటింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read: రెండు గంటలు.. రెండు గోల్డ్ మెడల్స్.. ఒలింపిక్స్ లో అరుదైన ఫీట్ 

నిరంతరాయంగా ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. శిథిలాల కింద ఉన్న శవాలను వెలికితీస్తున్నారు.  చూరాల్‌మలైలో దాదాపు 1000 మంది అసలు ఎక్కడున్నారో తెలియదని అక్కడున్నరెస్క్యూ సిబ్బంది తెలిపారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2400 మంది అయితే పిల్లలు అందరు కలిపి దాదాపు 3000 మంది ఉన్నారని.. అయితే కేవలం కొంత మంది మాత్రమే తప్పించుకున్నారని.. మిగితా వాళ్లు అసలు బ్రతికే ఉన్నారా? లేదా అనేది తెలియదన్నారు. డెడ్‌బాడీలు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయన్నారు.

Advertisment
తాజా కథనాలు