Tears Smell: అమ్మాయిల కన్నీళ్లకు ఇంత పవరా? కన్నీళ్లను వాసన చూస్తే ఇలా ఉంటది మరి..!

ఆడవాళ్ల కన్నీళ్లపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. స్త్రీల కన్నీళ్లలో పురుషుల ఆగ్రహాన్ని, దూకుడును తగ్గించే రసాయనాలున్నాయని అధ్యయనంలో తేలింది. ఆడవారి భావోద్వేగ కన్నీళ్లను పసిగట్టిన తరువాత ప్రతీకారం తీర్చుకునే బిహేవియర్ 40 శాతం తగ్గిందని తేలింది.

New Update
Tears Smell: అమ్మాయిల కన్నీళ్లకు ఇంత పవరా? కన్నీళ్లను వాసన చూస్తే ఇలా ఉంటది మరి..!

Tears Smell: తాజాగా మహిళల కన్నీళ్లకు ఉండే పవర్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటే మగవాళ్లకు చాలా కోపం వస్తుంది. అదే సమయంలో.. మగాడి కోపాన్ని అస్సలు అంగీకరించని ఆడవాళ్లు కన్నీళ్లను కార్చేస్తుంటారు. వాటిని వాసన చూస్తే మాత్రం తగ్గిపోతారట. చిన్నదాని వాలుచూపులకు ఇట్టే పడిపోయే మగాళ్లు ఉండరని చాలామంది అంటుంటారు. అయితే.. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తాజాగా ఆడవారి కన్నీళ్లపై ఓ పరిశోధన చేశారు. స్త్రీల కన్నీళ్లలో పురుషుల ఆగ్రహాన్ని, దూకుడును తగ్గించే రసాయనాలున్నాయని అధ్యయనంలో తెలింది. ఆడవాళ్ల కన్నీళ్లపై కొన్ని విషయాలు తెలుసుకుందాం.

క్కువ కోపం కలిగి ఉన్నారని..

కన్నీటికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్, యాంటీరియర్ ఇన్సులాలో కార్యచరణ తగ్గుతుందని గుర్తించారు. దీని ఫలితంగా తక్కువ కోపం కలిగి ఉన్నారని తెలిపారు. సాధారణంగా జంతువుల్లో ఈ బిహేవియర్ ఇప్పటికే గుర్తించారు. తాజాగా మానవుల్లో సొసైటీ కెమోసిగ్నలింగ్ ఉనికి ఉన్నట్లు నిర్ధారించారు. ఆడ కన్నీళ్ల వాసన చూసినప్పుడు మగ ఎలుకల్లో దూకుడు తగ్గుతుంది. అదే మనుషుల్లో కూడా జరుగుతుందో..? లేదో..? తెలుసుకునేందుకు పరిశోధకులు ఓ గేమ్‌ను ఉపయోగించారు . ఇద్దరు వ్యక్తులు ఆట ఆడుతున్నప్పుడు ఆడవారు కన్నీళ్లు లేదా సెలైన్‌లకు మగవారు సమూహాన్ని ఎక్స్‌పోజ్ చేశారు.

మెదడులో చురుగ్గా పనిచేయగా..

ఇతర ఆటగాడికి వ్యతిరేకంగా దూకుడుగా ప్రవర్తించేలా గేమ్ పెట్టారు. అయితే ఇలాంటి అవకాశం ఉన్నప్పుపుడు డబ్బును కోల్పోయేలా చేయడం ద్వారా ఇతర ఆటగాడిపై ప్రతీకారం తీర్చుకుంటారు. అయితే.. ఆడవారి భావోద్వేగ కన్నీళ్లను పసిగట్టిన తరువాత ప్రతీకారం తీర్చుకునే బిహేవియర్ 40 శాతం కంటే ఎక్కువ పడిపోయని పరిశోధకులు కనుగొన్నారు. ఆట ఆడే టైంలో రెచ్చగొట్టబడినప్పుడు ఎంఆర్‌ఐ స్కానర్‌లో మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్, యాంటీరియర్ ఇన్సులా చురుగ్గా పనిచేయగా.. కన్నీళ్లను పసిగట్టినప్పుడు అంత చురుగ్గా లేదని గుర్తించారు. పరిశోధనలో స్త్రీల నుంచి వచ్చే కన్నీళ్లలో రసాయనాలు పురుషుల మెదడు కార్యకలాపాలను దూకుడుతో ముడిపడి ఉంటుంది. తద్వారా వారిలో దూకుడు ప్రవర్తనను బలహీనపరుస్తుందని తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి: అన్నం తింటే బరువు పెరుగుతారని భయంగా ఉందా..? అయితే రైస్‌ని ఇలా వండి చూడండి!!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు