/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Prabhakar-Rao-America-jpg.webp)
Phone Tapping Case: అమెరికాలోనే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు ఉన్నారు. ఆయన ఈ రోజు అమెరికా నుంచి వస్తారని, అప్రూవర్ గా మారుతారని వార్తలు వచ్చాయి. కానీ అవన్ని అవాస్తమని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ కేసు తర్వాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. అయితే.. అమెరికాలో ప్రభాకర్ రావు క్యాన్సర్ చికిత్స తీసకుంటున్నారు. మరో 3 నెలల పాటు ఆయన అమెరికాలోనే ఉండనున్నట్లు ఆయన సమాచారం ఇచ్చినట్లు సమాచారం. మరో వైపు దర్యాప్తులో భాగంగా ప్రభాకర్ రావు నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభాకర్ రావు వస్తేనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమకు సహకరించాలని పోలీసులు ప్రభాకర్ రావును కోరినట్లు తెలుస్తోంది.