Summer Energy Drink: వేసవిలో తక్షణం ఎనర్జీ ఇచ్చే డ్రింక్‌.. తాగితే వదలరు..!

బీహార్‌లోని అనేక వంటకాలలో ప్రసిద్ధి చెందిన లిట్టి చోఖా గురించి చాలామందికి తెలియదు. ఇందులో వాడే పదార్థాలతో ఎనర్జీ డ్రింక్‌ను తయారు చేస్తారు. వేసవి కాలంలో ఈ డ్రింక్‌ తాగితే అమృతంతో సమానం. డ్రింక్‌ తయారీ విధానం కోసం ఆర్టికల్‌కి వెళ్లండి.

New Update
Summer Energy Drink: వేసవిలో తక్షణం ఎనర్జీ ఇచ్చే డ్రింక్‌..  తాగితే వదలరు..!

Summer Energy Drink: బీహార్‌ వాళ్ల ఆహారపు అలవాట్లలో చాలా వైవిధ్యం ఉంటుంది. బీహార్‌లోని అనేక వంటకాలను దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా ఇష్టంగా తింటారు. బీహార్‌లో ప్రసిద్ధి చెందిన లిట్టి చోఖా గురించి ఎవరికి తెలియదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా లిట్టి చోఖాను చాలాసార్లు ప్రశంసించారు. అయితే ఇందులో వాడే పదార్థాలతో ఎనర్జీ డ్రింక్‌ను కూడా తయారు చేస్తారు.

ఎనర్జీ డ్రింక్ తయారీ:

  • కుండ ఆకారంలో ఉన్న ఓ పాత్రలో ముందుగా నీరు పోయాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, శెనగపిండి వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత తరిగిన ఉల్లిపాయ, చాట్ మసాలా, నిమ్మరసం, మసాలా దినుసులు, పచ్చి చట్నీ వేసి మరోసారి శెనగపిండి వేస్తే ఎనర్జీ డ్రింక్‌ తయారవుతుంది. పాతకాలంలో పెద్దలు ఈ జావను తాగి ఆకలిని తీర్చుకునేవారు.

ఎనర్జీ డ్రింక్‌ ప్రయోజనాలు:

  • వేసవి కాలంలో ఈ డ్రింక్‌ తాగితే అమృతంతో సమానం అని వైద్యులు చెబుతున్నారు. దీన్ని తాగడం వల్ల వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరం కూడా హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇందులో కాల్షియం, ఫైబర్, ఐరన్, మాంగనీస్, ప్రొటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి జావలను ఎక్కువగా తాగుతుంటారు. పాతకాలంలో ఎక్కువగా రాగి అంబటి, సజ్జలు ఘటక ఇలా తృణధాన్యాలతో చేసిన జావలను ఎక్కువగా తీసుకునేవారు. పొద్దున్నే పనులకు వెళ్లేప్పుడు మజ్జిగ, ఉల్లిపాయ అన్నం తీసుకునేవారు ఇలా తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు. పనులు కూడా చురుగ్గా చేసుకోగలిగేవారని పెద్దలు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: స్వీట్స్‌తో బరువు పెరుగుతుందని భయపడుతున్నారా?..దానికి బదులు ఇవి తినండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు