Inspector Rishi: ఓటీటీలో నవీన్ చంద్ర హారర్ డ్రామా.. చూస్తే భయపడాల్సిందే నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ "ఇన్స్పెక్టర్ రిషి". తాజాగా మేకర్స్ ఈ సీరీస్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ నెల 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్ తో పాటు మరో ఐదు భాషల్లో అందుబాటులో ఉండనుంది. By Archana 15 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Inspector Rishi OTT Release: ప్రేక్షకుల్లో ఓటీటీల క్రేజ్ బాగా పెరిగిపోయింది. చిన్న, పెద్ద సినిమాలని తేడా లేకుండా ప్రతీ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో హర్రర్ మూవీ (Horror Movie) సిద్ధమైంది. యాక్టర్ నవీన్ చంద్ర (Naveen Chandra) నటించిన "ఇన్‌స్పెక్టర్ రిషి" వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. Also Read: Surekha Vani: ఆయనను మళ్ళీ చూడాలి.. భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా "ఇన్‌స్పెక్టర్ రిషి" నందిని దర్శకత్వంలో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'ఇన్స్పెక్టర్ రిషి'. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సీరిస్.. ఈ నెల 29 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) వీడియో వేదికగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ్ తో పాటు మరో ఐదు భాషల్లో ఈ సీరీస్ అందుబాటులో ఉండనుంది. అదిరిపోయే కథాంశంతో తెరకెక్కిన ఈ సీరీస్ లో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. సునైనా, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకృష్ణ దయాళ్, కుమారవేల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సీరిస్ ను మొత్తం 10 ఎపిసోడ్స్ గా రిలీజ్ చేయనున్నారు. అంతు చిక్కని హత్యల వెనుక ఎవరు ఉన్నారు అనే సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సీరిస్ ఉండబోతుంది. ఈ హత్యల మిస్టరీని ఇన్స్పెక్టర్ రిషి ఎలా ఛేదించారనేదే కథాంశం. the laws of state don’t bind the supernatural!#InspectorRishiOnPrime, Mar 29@MBP_ProdCo @Naveenc212 @TheSunainaa @shukdev_lahiri @nandhini_js @jithinthorai #SrikrishnaDayal #Kumaravel @iamkannaravi @MalniJevaratnam #BargavSridhar @editorsuriya @MusicAshwath @MishMash2611… pic.twitter.com/2M3oPzZFyB — prime video IN (@PrimeVideoIN) March 14, 2024 నవీన్ చంద్ర గురించి పరిచయం అవసరం లేదు. హీరోగా, విలన్ గా నటిస్తూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లు కూడా చేస్తూ బిజీగా సాగుతున్నారు. రీసెంట్ గా విడుదలైన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రలో కనిపించి అభిమానులకు మరింత దగ్గరయ్యారు. గతంలో అమ్ము, పరంపర వెబ్ సీరీస్ లలో నటించారు. Also Read: Mamitha Baiju: నయా క్రష్.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ? #actor-naveen-chandra #inspector-rishi-web-series #amazon-prime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి