హైదరాబాద్‌లో ఈడీ అధికారుల తనిఖీలు వరుస దాడులతో ఈడీ అధికారులు హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్నారు. ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీతో బడాబాబులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తారనే భయం ఇప్పుడు అందరిలో మొదలైంది. By Vijaya Nimma 21 Jun 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు సంచలనం సృష్టించాయి. తాజాగా కామినేని ఆస్పత్రి ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ‌్రీధర్ నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేవలం ఇళ్లలోనే కాకుండా కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో కూడా ఈడీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ తనిఖీలు సాగుతున్నాయి. ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. మెడికల్ కళాశాలతోపాటు యాజమాన్యం ఆస్తులపై ఆరా తీస్తున్నారు. షామీర్‌పేటలోని మెడిసిటీ కళాశాల ఏరియాలో అధికారులు దాడులు చేస్తున్నారు. ఫిల్మ్‌నగర్‌లోని ప్రతిమా కార్పొరేట్ కార్యాలయంపై ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం రెండు టీంలుగా విడిపోయి మరీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు నుంచి 11 బృందాలుగా ఈడీ అధికారులు బుధవారం ఉదయం బయలుదేరారు. ఈడీ బృందాలతోపాటు సీఆర్పీఎఫ్ బలగాలు కూడా వారి వెంట ఉన్నాయి. భాగ్యనగరంతో పాటు మహబూబ్‌నగర్, మేడ్చల్, నల్లొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్ఖానా, చౌటుప్పల్, జడ్చర్ల, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, గచ్చిబౌలి, వోఆర్ఆర్, శామీర్‌పేట వైపు ఈడీ బృందాలు వెళ్లాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి